Satyam Sundaram: నందమూరి నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే ఆయన దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవ్వబోతున్న నేపధ్యంలో ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఇప్పుడిప్పుడే విపరీతమైన హైప్ కూడా క్రియేట్ అవుతుంది. ఇక ఈ సినిమా కోసం యావత్ భారతదేశ ప్రేక్షకులు మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ కి పోటీగా ఏ హీరో కూడా సినిమాని దింపే ఆలోచనలో అయితే లేరు. కానీ తమిళ్ స్టార్ హీరో అయిన కార్తీ మాత్రం తన ‘సత్యం సుందరం’ సినిమాతో సెప్టెంబర్ 28వ తేదీన థియేటర్లోకి రాబోతున్నాడు.
మరి ఎన్టీఆర్ కి పోటీగా వస్తున్న కార్తీ తన సినిమాతో ఎంత వరకు మెప్పిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే వచ్చిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్ని చాలా వరకు ఆకట్టుకుంటుంది. కార్తీ, అరవిందస్వామి మధ్య బావ బామ్మర్దిలో రిలేషన్ షిప్ తో ఈ సినిమా సాగబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఈ సినిమా నాచురల్టీకి చాలా దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలాగే చిన్న చిన్న ఎమోషన్స్ ని హైలెట్ చేసి చూపించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక దేవర సినిమా రిలీజ్ అయిన ఒక్క రోజు గ్యాప్ లోనే ఈ సినిమా వస్తుంది. దేవర సినిమాకు హిట్ టాక్ వచ్చిందంటే సత్యం సుందరం మాత్రం అడ్రస్ లేకుండా పోతుంది.
కానీ దేవర కి డివైడ్ టాక్ కనక వచ్చినట్లైతే మాత్రం సత్యం సుందరం సినిమా వైపు ప్రతి ఒక్కరు చూపు ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక సత్యం సుందరం సినిమాని దేవర కి పోటీగా తెస్తూ కార్తీ చాలా వరకు రిస్క్ అయితే చేస్తున్నాడు. ఇక దేవర పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆ సినిమాకి మంచి ఆదరణ అయితే దక్కే అవకాశాలు ఉన్నాయి.
ఇక సత్యం సుందరం తెలుగు తమిళంలో మాత్రమే రిలీజ్ అవుతున్న నేపథ్యంలో తెలుగులో మన హీరోని కాదని కార్తీ ని ఆదరించే అవకాశాలు అయితే లేవు. ఒకవేళ దేవర కి నెగిటివ్ టాక్ కనక వచ్చి, సత్యం సుందరం కి పాజిటివ్ టాక్ వస్తే తప్ప ఆ సినిమాకు ఆదరణ అయితే దక్కే అవకాశాలు లేవు. మరి ఇలాంటి క్రమంలో కార్తీ ఒక వన్ వీక్ ముందే తన సినిమాని రిలీజ్ చేసుకుంటే బాగుండేది అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…