https://oktelugu.com/

Theatre : ఒక్క థియేటర్ కూడా లేని ఏకైక దేశం అదేనా..? అక్కడ సినిమాలు చూడడం నేరమా? ఎందుకు అలా!

Theatre : మన దేశం లోనే కాదు, ఏ దేశంలో అయిన ఎంటర్టైన్మెంట్(Entertainment) రంగం లో సినిమా ఇండస్ట్రీ ప్రాముఖ్యత సింహభాగం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Written By: , Updated On : February 25, 2025 / 02:47 PM IST
Theatre

Theatre

Follow us on

Theatre : మన దేశం లోనే కాదు, ఏ దేశంలో అయిన ఎంటర్టైన్మెంట్(Entertainment) రంగం లో సినిమా ఇండస్ట్రీ ప్రాముఖ్యత సింహభాగం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 24 గంటలు ఎన్నో సమస్యలతో సతమతమయ్యే ఒక మనిషికి, రెండు గంటల పాటు వినోదాన్ని అందించి, వారి మనసులో ఆనందాన్ని కలిగించేదే సినిమా. అందుకే ఎంటర్టైన్మెంట్ విభాగం లో ఎన్ని ఉన్నప్పటికీ, సినిమా కి ఉన్న క్రేజ్ మరోదానికి ఉండదు. మన సౌత్ లో సినిమా హీరోలను దేవుళ్ళు లాగా కొలుస్తుంటాము. సినిమా ఇండస్ట్రీ కి చెందిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి శాసనాలు సృష్టించే స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. నార్త్ ఇండియా వైపు సినీ హీరోలంటే ఇంత పిచ్చి అభిమానం ఉండదు , కానీ ఒక మంచి సినిమా వస్తే వందల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను అందచేస్తుంటారు నార్త్ ఇండియన్స్. మన ఇండియన్ సినిమాలు కేవలం ఇండియా లో మాత్రమే కాదు, విదేశాల్లో కూడా సంచలనం సృష్టిస్తుంటాయి.

అయితే ప్రపంచం మొత్తం మీద కనీసం ఒక్క థియేటర్ కూడా ఉందని దేశం ఒకటి ఉంది. ఆ దేశం పేరు భూటాన్. ఇక్కడి ప్రభుత్వాలు సినిమా థియేటర్స్(Theatres) ని అసలు ప్రోత్సహించారట. సినిమాల ప్రభావం జనాల మీద చాలా పడుతుందని, సినిమా జనాలను బుర్రను పాడు చేస్తుందనే భావంతో ఉంటారట. అందుకే అక్కడ థియేటర్స్ ఉండవు. కానీ అక్కడి ఆడియన్స్ మాత్రం టీవీ, ఓటీటీ లలో సినిమాలను చూస్తుంటారు. యూట్యూబ్(Youtube) లో మన సౌత్ సినిమాలకు వేల మిల్లియన్లలో వ్యూస్ వస్తున్నాయంటే అందుకు కారణం ఇలాంటి ప్రాంతాలకు చెందినవాళ్లు అత్యధికరంగా చూస్తుంటారు కాబట్టి. అక్కడి వాళ్లకు కూడా థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూడాలనే కోరిక ఉంటుంది. కానీ వాళ్ళ సంస్కృతి లో భాగంగా అది నిషేధం కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో థియేటర్స్ ని బ్యాన్ చేయాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో అయినా ఈ సంస్కృతి లో మార్పులు వస్తాయో లేవో చూడాలి.