Orange : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) కెరీర్ లో ఒకప్పుడు డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన ‘ఆరెంజ్'(Orange Movie ReRelease) చిత్రం, ఇప్పుడు ఆయన కెరీర్ లో కల్ట్ క్లాసిక్ గా మారిపోయింది. ముఖ్యంగా నేటి తరం యూత్ ఆడియన్స్ ఈ సినిమాకి వేరే లెవెల్ లో కనెక్ట్ అయ్యారు. స్టోరీ కి కనెక్ట్ అయ్యారో, లేకపోతే పాటలకు కనెక్ట్ అయ్యారో విశ్లేషకులకు సైతం అర్థం కావడం లేదు కానీ, థియేటర్స్ లో మాత్రం ఈ చిత్రం విడుదలైన విజయవంతంగా 12 రోజులు పూర్తి చేసుకొని 13 వ రోజు లోకి అడుగుపెట్టింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 న ఈ చిత్రం విడుదలైంది. అప్పటి నుండి నేటి వరకు ఈ సినిమాకి డీసెంట్ స్థాయి గ్రాస్ వసూళ్లు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాతో పాటు విడుదలైన కొత్త సినిమాలు థియేటర్స్ నుండి వెళ్లిపోయాయి కూడా. కానీ ఆరెంజ్ మాత్రం రెండవ వారం లో కూడా గణనీయమైన షోస్ తో ప్రదర్శింపబడుతోంది.
హైదరాబాద్ లాంటి సిటీ లో ఈ చిత్రం ఇప్పటికీ రోజుకు 20 కి పైగా షోస్ తో ప్రదర్శితమవుతోంది. ప్రతీ రోజు ప్రైమ్ టైం షోస్ దాదాపుగా హౌస్ ఫుల్ అవ్వడం గమనించాల్సిన విషయం. ఇదే ఫ్లో కొనసాగుతూ ముందుకు పోతే, మూడవ వారం లో కూడా ఈ చిత్రానికి థియేట్రికల్ రన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి రీ రిలీజ్ అయిన సినిమాని, రెండవ సారి రీ రిలీజ్ చేస్తే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందని ట్రేడ్ పండితులు సైతం ఊహించి ఉండరు. ట్రేడ్ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ సినిమాకి రెండవ రీ రిలీజ్ లో రెండు కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. శివరాత్రికి కూడా పలు చోట్ల స్పెషల్ షోస్ ని ఏర్పాటు చేసారు ఫ్యాన్స్.
స్పెషల్ షోస్ కి వచ్చే గ్రాస్ ని కూడా జత చేస్తే మరో పది లక్షల రూపాయిల గ్రాస్ ని అదనంగా వసూళ్ళలో జత చేయొచ్చు. ఓవరాల్ గా రెండు రీ రిలీజ్ లను కలిపి ఈ సినిమాకి 6 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ప్రతీ ఏడాది ఈ చిత్రాన్ని ఇక నుండి రామ్ చరణ్ పుట్టినరోజు కి కానీ, వాలెంటైన్స్ డే కి కానీ ప్రదర్శించాలని నిర్మాత నాగబాబు అనుకుంటున్నాడట. ఇదే కనుక జరిగితే అప్పట్లో నాగబాబు(Nagendra Babu Konidela) ఈ సినిమా ద్వారా కోల్పోయిన డబ్బులు మొత్తం రీ రిలీజ్ ద్వారా తిరిగి సంపాదించుకున్నట్టు అవుతుంది. వినేందుకు ఇది అతిశయం అనిపించినా, ఆరెంజ్ చిత్రం లోని పాటలను థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తే వచ్చే కిక్ మామూలుది కాదు. ఇప్పటికీ ఆ పాటలు ఎంతో ఫ్రెష్ గా ఉంటాయి.