Tollywood Music Directors: ఒక సినిమా సక్సెస్ అవ్వాలి అంటే సినిమా స్టోరీ, డైరెక్షన్ తో పాటు మ్యూజిక్ కూడా బాగుండాలి… ఒక సీన్ ప్రేక్షకుడిని ఆకట్టుకోవాలన్న, అందులోని ఎమోషన్స్ ప్రేక్షకుల హృదయాన్ని తాకడానికి మ్యూజిక్ చాలా కీలక పాత్ర వహిస్తోంది. ఇక ఈ మధ్యకాలంలో బ్యాగ్రౌండ్ స్కోర్ తో సూపర్ సక్సెస్ ని సాధించిన సినిమాలు సైతం చాలానే ఉన్నాయి… ఈ సంవత్సరం తన మ్యూజిక్ తో ఎవరు మ్యాజిక్ చేశారు టాప్ లెవల్లో ఎవరు నిలిచారు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
2025 సంక్రాంతి కానుకగా వచ్చిన ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాని భీమ్స్ మ్యూజికల్ హిట్టుగా నిలిపాడు. ఈ సినిమాతో బీమ్స్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు…ప్రస్తుతం వస్తున్న చాలా చిన్న సినిమాలకు కొన్ని పెద్ద సినిమాలకు తనే మ్యూజిక్ ను అందిస్తుండటం విశేషం…
ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఓజీ సినిమా 400 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టి ఈ ఇయర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాకి మ్యూజిక్ ని అందించిన తమన్ బ్యా గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమా మీద హైప్ ని పెంచేశాడు. ఇక ఈ సినిమా సక్సెస్ లో తన మ్యూజిక్ కీలకపాత్ర వహించడంతో తమన్ ఈ సంవత్సరం టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగాడు. ప్రస్తుతం తెలుగులో ఆయన మొదటి స్థానంలో ఉన్నాడు…
ఇక తమన్ ఇండియాలోనే నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన అఖండ 2 సినిమా రిజల్ట్ ఎలా ఉన్న కూడా బిజిఎం తో అదరగొట్టాడు అంటూ తమన్ మీద చాలా మంది ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించారు…
ఈ ఇయర్ దేవిశ్రీ ప్రసాద్, అనిరుధ్, హర్షవర్ధన్ రామేశ్వర్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ల హవా తగ్గింది. ఈ సంవత్సరం మొత్తం తమన్ హవానే కొనసాగింది. ఇక తమన్ చేసిన సినిమాలు పెద్ద మూవీస్ కావడం వల్ల వాటికి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ రావడంతో తన మ్యూజిక్ ను సైతం ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. దానివల్లే అతను టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు…