Mega Victory Mass Song: ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి భారీ లాభాలు తెచ్చి పెట్టిన సినిమా మరొకటి లేదు. ఈ చిత్రం ఆ రేంజ్ లో హిట్ అవ్వడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఏది కూడా ప్లాన్ చేసి చేయలేదు. మొత్తం ఆర్గానిక్ గానే జరిగింది. విడుదల చేసిన ప్రతీ పాట చార్ట్ బస్టర్ అవ్వడం, ప్రొమోషన్స్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవ్వడం, థియేట్రికల్ ట్రైలర్ కూడా ఆకట్టుకోవడం, ఇలా ప్రతీ ఒక్కటి ఆర్గానిక్ గా జరగడం వల్లే, ఆ సినిమాపై అంతటి హైప్ ఏర్పడి ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోజింగ్ వరకు బాక్స్ ఆఫీస్ ని బ్లాస్ట్ చేసే రేంజ్ వసూళ్లను రాబట్టిన సినిమాగా నిల్చింది. ఇదే మ్యాజిక్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి కూడా రిపీట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగడం లేదు.
‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం విడుదలకు ముందు టీవీ పెడితే ప్రతీ ఛానల్ లోనూ ఈ మూవీ టీం ఎదో ఒక ప్రమోషనల్ కార్యక్రమం లో కనిపిస్తూ వచ్చేది. కానీ ఇప్పుడు ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ టీం తప్ప, మిగిలిన సంక్రాంతి సినిమాలకు సంబంధించిన నటీనటులు టీవీ ప్రొమోషన్స్ లో కనిపిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు మూడు పాటలు విడుదల అయ్యాయి. వీటిల్లో ‘మీసాల పిల్ల’ పాట తప్ప, మిగిలినవన్నీ యావరేజ్ రేంజ్ అని అనిపించుకున్నాయి . నిన్న విడుదలైన ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ బాగా పేలుద్ది అని అనుకున్నారు. చిరంజీవి , వెంకటేష్ కలిసి డ్యాన్స్ వేయడం వల్ల, ఈ పాటని విడుదల చేసిన వెంటనే సోషల్ మీడియా మొత్తం షేక్ అవ్వుద్ది అనుకున్నారు, కానీ అదేమీ జరగలేదు. కనీసం మెగా అభిమానులు కూడా ఈ పాట గురించి మాట్లాడుకోలేదు.
‘వాల్తేరు వీరయ్య’ మూవీ లో ‘పూనకాలు లోడింగ్’ పాటకు చిరంజీవి, రవితేజ కలిసి డ్యాన్స్ చేస్తే ఎంత మాస్ ఎనర్జీ కనిపించింది?, ఆ ఎనర్జీ, వైబ్ ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ లో మిస్ అయ్యింది. ఎదో కెమెరా కి ఫోజులు ఇస్తూ కొన్ని మ్యానరిజమ్స్ చేశారు కానీ, అవి ఆర్టీఫిషియల్ గానే అనిపించింది. ఒక జనరేషన్ కి చెందిన ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి డ్యాన్స్ చేస్తే ఎలా ఉండాలి అసలు?, ఆ ఊపు నిన్న విడుదల చేసిన పాటలో ఇసుమంత కూడా కనిపించలేదు. సాంగ్ నిడివి కూడా చాలా తక్కువ ఉంది. అనిల్ రావిపూడి ఈ సినిమాకి వ్యవహరించిన తీరు ఎలా ఉందంటే, రెమ్యూనరేషన్ బాగా తీసుకున్నాం, కాబట్టి ఎదో సినిమా తియ్యాలి కాబట్టి తీసినట్టు గా అనిపిస్తుంది. హానెస్ట్ అటెంప్ట్ లాగా అసలు అనిపించడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి వినిపిస్తున్న మాట.
