Ponniyan Selvan Actors Remuneration: ఇటీవల కాలంలో తారల పారితోషికాలు అమాంతం పెరిగాయి. దీంతో సినిమా నిర్మించాలంటే ఓ పెద్ద సవాలే. గతంలో ఇంతలా పారితోషికాలు లేకపోవడంతో ఏదో నామమాత్రంగా డబ్బు ఉంటే సరిపోయేది. ప్రస్తుత పరిస్థితుల్లో రూ. వందల కోట్లు పెట్టకపోతే సినిమా నిర్మాణం పూర్తి కాదు. ఇప్పుడు సినిమా నిర్మించాలంటే అదో పెద్ద చాలెంజ్ గా మారుతోంది. సినిమా హిట్టయితే ఫర్వాలేదు కానీ ప్లాఫ్ అయితే మాత్రం నిర్మాతకు తలనొప్పే. ఎందుకంటే భారీగా డబ్బు పెట్టడంతో హిట్ కాకపోతే అనే ప్రశ్న వస్తేనే ఏదో ఇబ్బందిగా అనిపిస్తున్న తరుణంలో సినిమా నిర్మాణం నిజంగా ఓ పెద్ద లక్కీ డ్రా ఆటగానే భావించుకోవాలి.

లక్కీ డ్రాలో కూడా డబ్బు పెడితే వస్తుందో రాదో కూడా తెలియదు. అలాగే సినిమా నిర్మాణంలో కూడా లాభం వస్తుందో లేక నష్టమే పలకరిస్తుందో చెప్పలేం. పెరిగిన ధరలతో అన్నింటికి పెంచేశారు. ప్రస్తుతం తారల పారితోషికాలు చూస్తే మతులు పోవడం ఖాయమే. ఒక్కో తారకు రూ. కోట్లలోనే డబ్బు చెల్లించాల్సి రావడంతో నిర్మాతకు చుక్కలు కనిపిస్తున్నాయి. తాజాగా సౌత్ ఇండియా స్థాయిలో సంచలన దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన సినిమా పొన్నియిన్ సెల్వన్ -1 సినిమాలో ప్రధాన తారలు తీసుకున్న పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం.
పారితోషికాలు భారీగా ఉండటంతో సినిమా నిర్మాణ వ్యయం కూడా అమాంతం పెరిగిపోయింది. లాభాల మాట దేవుడెరుగు కానీ నష్టం వస్తే ఇక నిర్మాత ఇల్లు గుల్ల కావాల్సిందే. ఈ సినిమాలో హీరో విక్రమ్ రూ.12 కోట్లు తీసుకుంటున్నారు. హీరోయిన్లలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ రూ. 10 కోట్లు, జయం రవి రూ.8 కోట్లు, కార్తి రూ. 5 కోట్లు, త్రిష రూ. 2.5 కోట్లు, ఐశ్వర్య లక్ష్మి రూ 1.5 కోట్లు, ప్రభు రూ. 1.25 కోట్లు, శోభిత ధూళిపాళ రూ. కోటి, ప్రకాశ్ రాజ్ రూ. కోటి తీసుకున్నారు. దీంతో సినిమా నిర్మాణం అంత తేలిగ్గా పూర్తి కాదని చెబుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు పెరగడంతో దాని ప్రభావం అన్నింటిపై పడింది. ఈ నేపథ్యంలోనే సినిమా నిర్మాణం డబ్బుతోనే కూడుకున్నది. డబ్బు ఖర్చు పెట్టనిదే ముందుకు సాగదు. బాహుబలికి అయితే వంద కోట్లు ఖర్చు పెట్టినా వారికి లాభాలు కూడా అదే రేంజ్ లో రావడం నిజంగా గమనార్హం. ఈ క్రమంలో ప్రస్తుత తరుణంలో సినిమాలు నిర్మించాలంటే కోట్ల కొద్ది డబ్బు ఉండాల్సిందే. లేకపోతే సినిమా నిర్మాణం ముందుకు సాగదు. ఏదిఏమైనా నిర్మాతలు ధైర్యంతో సినిమాలు తీయడంతో వారిని అభినందించాల్సిందే. సినిమా రంగాన్ని బతికించడంలో నిర్మాతలదే ప్రముఖ స్థానం కావడం గమనార్హం.
[…] […]