RC 16: పాన్ ఇండియా స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆయన హీరోగా తెరకెక్కనున్న చిత్రం RC 16. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్టర్ గా వ్యవహారిస్తుండగా వ్రిద్ది సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సహా నిర్మాతలుగా ఉండనున్నారు. ప్రెజెంట్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉండగా మూవీ వర్క్స్ శరవేగంగా కొనసాగుతున్నాయి.
తాజాగా నటనపై ఆసక్తి ఉన్న వారికి చిత్రబృందం గుడ్ న్యూస్ చెప్పింది. RC 16 లో నటించేందుకు నటీనటులు కావాలంటూ మేకర్స్ ఆడిషన్ కాల్ విడుదల చేశారు. అయితే వాటిలో కొన్ని నిబంధనలు పెట్టారట. ఇంతకీ ఆ సినిమాలో ఏ పాత్రలకు యాక్టర్స్ కావాలి.. నటుల నుంచి వారేం కోరుకుంటున్నారు అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సినిమా అంతా ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరగనున్న నేపథ్యంలో ఆ ప్రాంత యాస మాట్లాడే నటీనటులు కావాలని మూవీ టీం ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆసక్తి ఉన్న వారు ఒక నిమిషం పాటు ఉత్తరాంధ్ర యాసతో మాట్లాడుతూ ఏదైనా యాక్ట్ చేసిన వీడియోను తమకు పంపాలని ఓ మెయిల్ ఐడీ ఇచ్చారు. అయితే రీల్స్ కానీ, సెల్ఫీ వీడియోలు కానీ పంపొద్దని సూచించారు. వీడియోతో పాటు మూడు ఫొటోలు, ఇతర వివరాలను కూడా మెయిల్ లో తెలియజేయాలని తెలిపారు. ఇది విజయనగరం, శ్రీకాకుళం మరియు అనకాపల్లి ప్రాంతాల్లో ఉన్న నటీనటులకు బంఫర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. మరి మీకు కూడా ఉత్తరాంధ్ర యాస్ వచ్చా? ఆ స్లాంగ్ ను బాగా మాట్లాడగలరా? యాక్టింగ్ కూడా చేయగలరా.. మరి ఇంకేందుకు ఆలస్యం యాసలో మాట్లాడుతూ చక్కగా ఓ వీడియో చేసేయండి.. మూవీ టీమ్ కు పంపండి.. రామ్ చరణ్ నటిస్తున్న చిత్రంలో మీరు భాగం అవండి..