Guntur Karam Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ‘గుంటూరు కారం’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈమధ్యనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ సినిమా ఇప్పుడు షూటింగ్స్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఆలస్యం అవుతూ వస్తుంది. అందుకు కారణం మహేష్ బాబు అని కొందరు, కాదు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని మరికొందరు అనుకుంటున్నారు. ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించి కేవలం 10 శాతం షూటింగ్ మాత్రమే జరిగింది.
ఆ 10 శాతం షూటింగ్ కి సంబంధించిన టీజర్ ని మొన్న కృష్ణ జయంతి రోజు విడుదల చేసారు.ఇక రేపటి నుండి ఈ సినిమా షూటింగ్ విరామం లేకుండా సాగబోతుందట. ఇప్పటికే ఈ చిత్రం నుండి సంగీత దర్శకుడు తమన్ తప్పుకున్నాడు. పూజ హెగ్డే కూడా ఈ సినిమా నుండి తప్పుకుంది, ఇప్పటి వరకు తీసిన ఫుటేజీ మొత్తాన్ని తొలగించి సరికొత్త స్క్రిప్ట్ తో రేపటి నుండి షూటింగ్ మొదలు పెట్టబోతున్నారట.
ఇంతకు ముందు కూడా ఇంతే.. తొలుత యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నారు, ఒక షెడ్యూల్ ని పూర్తి చేసిన తర్వాత మహేష్ బాబు కి ఔట్పుట్ ఏమాత్రం నచ్చలేదు. యాక్షన్ ఎంటర్టైనర్ సబ్జెక్టు ని పక్కన పెట్టేసి, ఫ్యామిలీ డ్రామా చేద్దామని అన్నాడట. త్రివిక్రమ్ ఆయన మాటకు ఎదురు చెప్పకుండా, అలాగే అని చెప్పి ఫ్యామిలీ మరియు మాస్ జానర్స్ ని కలగలిపి ‘గుంటూరు కారం’ చిత్రం స్క్రిప్ట్ ని తయారు చేసారు.
ఇది కూడా ఆయనకీ కొంతభాగం షూటింగ్ జరిగిన తర్వాత ఔట్పుట్ నచ్చలేదు. ఇప్పుడు మళ్ళీ సరికొత్త స్క్రిప్ట్ తో మన ముందుకు రాబోతున్నారు. ఈసారైనా బ్రేకులు లేకుండా ఈ సినిమా షూటింగ్ సాగుతుందా, లేదా అనేది చూడాలి. ఒకవేళ బ్రేక్ పడితే మాత్రం ఇక సంక్రాంతికి వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.