Prabhas: ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఇద్దరు ముగ్గురు హీరోలలో ఒకడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సిరీస్ తర్వాత ఆయన రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంది. ఖాన్స్ తో సమానంగా, ఇంకా చెప్పాలంటే కొన్ని సినిమాలకు వాళ్ళకంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. అలా ఆయన ప్రస్తుతం ఒక్కో సినిమాకి 100 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడు.
ప్రస్తుతం ప్రభాస్ మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ మూడు సినిమాలకు గాను ఆయన రెమ్యూనరేషన్ మూడు వందల కోట్లరూపాయిలకు పైమాటే. అలా వచ్చిన రెమ్యూనరేషన్ లో కొంతభాగాన్ని ఇటలీలో కొన్ని వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టాడట. అంతే కాదు ఆయనకీ అక్కడ విల్లాలు మరియు ల్యాండ్స్ కూడా ఉన్నాయని సమాచారం. ఫుడ్ రెస్టారెంట్స్ , మరియు కమర్షియల్ కంప్లెక్స్ లు కూడా కట్టి, అద్దెకి ఇస్తున్నాడట. ఈ వ్యాపారాల విలువ కోట్లలోనే ఉంటుందని సమాచారం.
ఇక ప్రభాస్ సినిమా సినిమాకి వచ్చే గ్యాప్ లో కొంతకాలం రిలాక్స్ అయ్యేందుకు ఒక ప్రత్యేకమైన విల్లాని కట్టుకున్నాడట. తన స్నేహితులతో కలిసి ఈ విల్లా కి వచ్చి చిల్ అవుతుంటాడట.మొత్తం మీద ఆయనకీ ఇటలీ లో ఉన్న ఆస్తుల వివరాలు మొత్తం లెక్కగడితే వెయ్యి కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది. ఇక వ్యాపారాల నుండి ఆయనకీ నెలకు వంద కోట్ల రూపాయిల వరకు ఆదాయం ఉంటుందని, సినిమా ద్వారా వచ్చే డబ్బులకంటే కూడా, వ్యాపారాల నుండి వచ్చే డబ్బులే ఎక్కువని, ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ లో డబ్బులను సంపాదిస్తున్న హీరోనే ఇండస్ట్రీ లో లేరని అంటున్నారు విశ్లేషకులు.
ఇక ప్రభాస్ లేటెస్ట్ గా నటించిన ‘ఆదిపురుష్’ మూవీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాన్ని దక్కించుకోలేక పోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు 350 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం ఫుల్ రన్ లో ఎంత వరకు రాబడుతుందో చూడాలి.