Manchu Family: మంచు కుటుంబంలో వివాదం గురించి గంటగంటకు ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. కాసేపటి క్రితమే మంచు మనోజ్ మీడియా ముందుకు వచ్చి పోలీసులు ఇక పక్షంగా వ్యవహరిస్తున్నారని, తన భార్య బిడ్డలకు రక్షణ కావాలని, నా ఆత్మగౌరవం కోసమే పోరాటం చేస్తున్నాను వంటి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన కాసేపటికి మంచు కుటుంబం లో పనిచేసే పని అమ్మాయి ఒక వ్యక్తితో మాట్లాడిన వీడియో ని సోషల్ మీడియా లో లీక్ చేసింది మీడియా. ఆమె మాట్లాడుతూ ‘స్టాఫ్ గురించే గొడవ మొత్తం..మనోజ్ అన్నకి కోపం వచ్చి మోహన్ బాబు గారి స్టాఫ్ మీద చెయ్యి చేసుకున్నాడు. అప్పుడు మోహన్ బాబు గారు ఏదైనా ఉంటే నాతో మాట్లాడు, నా స్టాఫ్ మీద చెయ్యి వెయ్యకు, నేను వాళ్ళని కొట్టుకుంటా, తిట్టుకుంటా అవసరమైతే, అది నా ఇష్టం, నీకు వాళ్లకు సంబంధం లేదు’ అని అన్నాడట మోహన్ బాబు.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. తండ్రి కొడుకులు ఒకరిని ఒకరు తోసుకున్నారు. మీడియా లో చూపిస్తున్నట్టుగా పెద్ద గాయలయ్యేంత గొడవ కాదది’ అని చెప్పుకొచ్చింది. ‘ఆ సమయంలోనే పాత విషయాలు, ఆస్తి వ్యవహారాల గురించి గొడవలు మొదలై పెద్దది అయ్యింది. వాస్తవానికి భూమా మౌనిక గారిని పెళ్లి చేసుకోవడం ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. ఒక అబ్బాయి ఉన్న తల్లిని పెళ్లి ఎలా చేసుకుంటావ్ అంటూ అప్పట్లో మనస్పర్థలు ఏర్పడ్డాయి. అక్కడి నుండి మొదలైన ఈ వివాదం ఇక్కడి వరకు వచ్చి చేరింది’ అంటూ ఆమె చెప్పుకొచ్చిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. మోహన్ బాబు ఇంట్లో పని చేసే ఒక పని అమ్మాయి ఇంత ధైర్యంగా బయట వాళ్లకు ఎలా చెప్పింది?, ఇది మోహన్ బాబు కి తెలిస్తే ఆమె ఉద్యోగానికే ప్రమాదం కదా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
మరోపక్క ఈ వివాదం గురించి మోహన్ బాబు ఈరోజు ఉదయం మీడియా తో మాట్లాడుతూ ప్రతీ ఇంట్లో ఉన్నట్టుగానే మా ఇంట్లో కూడా అన్నదమ్ముల మధ్య కొన్ని విదేదాలు ఉన్నాయి. వాటిని మేమే మాట్లాడుకొని పరిష్కరించుకుంటాము, ఎన్నో కుటుంబాల మధ్య సమస్యలను పరిష్కరించి వాళ్ళను కలిపిన వాడిని నేను, ఈరోజు నా ఇంట్లోనే ఇలాంటి సమస్య రావడం దురదృష్టకరం అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. మరోపక్క మంచు విష్ణు దుబాయి నుండి ఇంటికి వచ్చాడని, ఇంటికి రాగానే మంచు మనోజ్ ని, అతని భార్య పిల్లలను ఇంటి నుండి తరిమేసాడని, మనోజ్ ఇంటి గేట్ బయటే కుర్చీ వేసుకొని కూర్చున్నాడని మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జరుగుతున్న ఈ వ్యవహారం మొత్తం పై మంచు విష్ణు రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మీడియా మొత్తం ఎదురు చూస్తుంది.