https://oktelugu.com/

రాంచరణ్ లాక్ చేసిన డైరెక్టర్ల లిస్టు పెద్దదే..!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో నటిస్తున్నాడు. దర్శకదిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్(రణం రౌద్రం రుధిరం)’పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ మూవీలో రాంచరణ్ తోపాటు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. వీరిద్దరు ఒకే స్క్రీన్ పై కన్పించనుండటంతో మెగా.. నందమూరి ఫ్యాన్స్ ఈ మూవీకోసం అత్రుతగా ఎదురుచూస్తున్నారు. Also Read: పవన్ కోసం కథను ఫైనల్ చేసిన బండ్ల ! ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా కన్పించబోతుండగా ఎన్టీఆర్ కొమురంభీంగా నటిస్తున్నారు. ఇటీవల […]

Written By:
  • NARESH
  • , Updated On : October 22, 2020 / 05:18 PM IST
    Follow us on

    మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో నటిస్తున్నాడు. దర్శకదిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్(రణం రౌద్రం రుధిరం)’పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ మూవీలో రాంచరణ్ తోపాటు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. వీరిద్దరు ఒకే స్క్రీన్ పై కన్పించనుండటంతో మెగా.. నందమూరి ఫ్యాన్స్ ఈ మూవీకోసం అత్రుతగా ఎదురుచూస్తున్నారు.

    Also Read: పవన్ కోసం కథను ఫైనల్ చేసిన బండ్ల !

    ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా కన్పించబోతుండగా ఎన్టీఆర్ కొమురంభీంగా నటిస్తున్నారు. ఇటీవల చెర్రీ పుట్టిన రోజు సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ విడుదలై సన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ టీజర్ తో సినిమా బ్లాక్ బస్టర్ అవడం ఖాయమనే టాక్ విన్పించింది.

    ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ క్రేజ్ వరల్డ్ వైడ్ గా పెరగడం ఖాయంగా కన్పిస్తోంది. దీంతో చరణ్ సైతం తన తదుపరి సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు. ఇందులో భాగంగా ప్యాన్ ఇండియా సినిమాలను చేసేందుకు మొగ్గుచూపుతున్నాడు. ఇప్పటికే పలువురు తమిళ దర్శకులతోపాటు తెలుగు దర్శకులను చరణ్ లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది.

    తెలుగు దర్శకుల విషయానికొస్తే త్రివిక్రమ్.. కొరటాల శివతో చరణ్ సినిమా చేసేందుకు మొగ్గుచూపుతున్నాడు. అయితే త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్.. మహేష్ తో సినిమా చేయాల్సి ఉంది. అదేవిధంగా కొరటాల ప్రస్తుతం ‘ఆచార్య’ చేస్తున్నాడు. దీని తర్వాత బన్నీతో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు.

    Also Read: ఎఫ్-2కు జాతీయ అవార్డు.. ఫ్రస్టేషన్ ఎందుకంట?

    ఈనేపథ్యంలో కేజీఎఫ్-2 దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. ప్రశాంత్ నీల్ తెలుగు హీరోతో ప్యాన్ ఇండియా సినిమా చేయాలని భావిస్తున్నాడు. ఎన్టీఆర్.. మహేష్.. ప్రభాస్ తో అతడి సినిమా ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆ ప్రాజెక్టు చరణ్ వద్దకు వచ్చే అవకాశం కన్పిస్తోంది.

    చరణ్ సైతం ప్యాన్ ఇండియా మూవీ చేయాలనుకుంటే కేజీఎఫ్ డైరెక్టర్ సరైన అప్షన్ అనే టాక్ విన్పిస్తోంది. దీంతో చరణ్ తదుపరి మూవీ ఎవరితో చేస్తారనే ఆసక్తి మెగా అభిమానుల్లో నెలకొంది.