https://oktelugu.com/

రాజశేఖర్ కూతురికి ధైర్యం చెప్పిన మెగాస్టార్.. ఎందుకంటే?

టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి.. హీరో రాజశేఖర్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వివాదాలున్నాయని అందరికీ తెల్సిందే. ఇటీవల ‘మా’ డైరీ వేడుకలోనూ చిరంజీవి-రాజశేఖర్ ల మధ్య మాటలయుద్ధం కొనసాగింది. ఈ విషయం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. కాగా హీరో రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు మెగాస్టార్ ట్వీట్ చేయడం ఆసక్తిని రేపుతోంది. Also Read: రాంచరణ్ లాక్ చేసిన డైరెక్టర్ల లిస్టు పెద్దదే..! లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా షూటింగులకు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 22, 2020 / 05:22 PM IST
    Follow us on

    టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి.. హీరో రాజశేఖర్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వివాదాలున్నాయని అందరికీ తెల్సిందే. ఇటీవల ‘మా’ డైరీ వేడుకలోనూ చిరంజీవి-రాజశేఖర్ ల మధ్య మాటలయుద్ధం కొనసాగింది. ఈ విషయం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. కాగా హీరో రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు మెగాస్టార్ ట్వీట్ చేయడం ఆసక్తిని రేపుతోంది.

    Also Read: రాంచరణ్ లాక్ చేసిన డైరెక్టర్ల లిస్టు పెద్దదే..!

    లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా షూటింగులకు అనుమతినిచ్చాయి. దీంతో స్టార్ హీరోలు.. నటీనటులంతా ఇటీవల షూటింగుల్లో పాల్గొంటున్నారు. ఈనేపథ్యంలో పలువురు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా హీరో రాజశేఖర్ ఫ్యామిలీ మొత్తం కరోనా బారినపడ్డారు. వీరిలో రాజశేఖర్ పరిస్థితి విషమంగా ఉండటంతో టాలీవుడ్లో ఆందోళన మొదలైంది.

    కరోనా నుంచి రాజశేఖర్ కూమార్తెలు శివాత్మిక.. శివానీలు త్వరగానే కోలుకున్నారు. రాజశేఖర్ భార్య జీవిత సైతం కొద్దిరోజులు ఆస్పత్రిలో చికిత్స చేయించుకోగా తాజాగా నెగిటివ్ వచ్చింది. అయితే రాజశేఖర్ మాత్రం కరోనాతో ఇంకా పోరాడుతున్నారు. ఈనేపథ్యంలోనే రాజశేఖర్ కూతురు శివాత్మిక తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.

    ‘కరోనాతో పోరాటం చేయడంలో నాన్న ఇబ్బంది పడుతున్నారని.. మీ అందరి అభిమానంతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారని ఆశిస్తున్నానని.. నాన్న త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేయండి అంటూ శివాత్మిక ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కు మెగాస్టార్ స్పందిస్తూ రీ రీట్వీట్ చేస్తూ శివాత్మికకు ధైర్యం చెప్పాడు.

    Also Read: పవన్ కోసం కథను ఫైనల్ చేసిన బండ్ల !

    ‘డియర్ శివాత్మిక.. మీ తండ్రి నా సహచరుడు.. స్నేహితుడు.. రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా.. ఆయనకు.. మీ కుటుంబానికి మా ప్రార్థనలు తోడుంటాయి.. ధైర్యంగా ఉండండి..’ అంటూ ట్వీట్ చేశాడు. చిరంజీవితోపాటు పలువురు సెలబ్రెటీలు రాజశేఖర్ ఆరోగ్యం గురించి తెలుసుకొని ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్వీట్ చేస్తున్నారు. అందరి ఆశీస్సులతో రాజశేఖర్ త్వరగా కరోనా నుంచి కోలుకుంటారని ఆశిద్దాం.