Vamika Gabbi : ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన వామిక గబ్బి అనే కుర్ర హీరోయిన్ లేటెస్ట్ వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఒక ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్న వామిక, తిరిగి వెళ్తున్న సమయం లో అభిమానులతో మాట్లాడిన క్యూట్ సంభాషణ, ఆ సంభాషణ సమయంలో ఆమె ఇచ్చిన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ కి కుర్రకారులు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఆమె కళ్ళు అద్భుతంగా ఉన్నాయని, ఈమె పక్కన హీరో గా చేసే వాళ్లకు అదృష్టం దొరికినట్టే అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఎవరు ఈ వామికా గబ్బి?, ఇంతకు ముందు మన తెలుగు సినిమాల్లో నటించిందా?, అసలు ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి?, ఒకప్పుడు లావుగా బొద్దుగా కనిపించిన ఈ అమ్మాయి, ఇంత సన్నగా, క్యూట్ గా ఎలా మారిపోయింది వంటి వివరాలు ఈ స్టోరీ లో తెలుసుకుందాం పదండి.
వామిక 2007 వ సంవత్సరం షాహిద్ కపూర్, కరీనా కపూర్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘జబ్ వీ మెట్’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది కానీ వామిక కి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఈ చిత్రం తర్వాత ఆమె ‘లవ్ ఆజ్ కల్’ అనే సినిమా చేసింది కానీ, ఆ చిత్రంలో కూడా నామమాత్రం పాత్రనే చేసింది. అలా 2014 వ సంవత్సరం వరకు ఈమె సైడ్ క్యారక్టర్ రోల్స్ మాత్రమే దక్కాయి. 2015 వ సంవత్సరం లో ఈమె మొట్టమొదటిసారి సుధీర్ బాబు హీరో గా నటించిన ‘భలే మంచి రోజు’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు కానీ, వామిక కి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రం తర్వాత ఈమె వరుసగా హీరోయిన్ పాత్రలే చేస్తూ వచ్చింది.
నేడు ఈమె హీరోయిన్ గా నటించిన ‘బేబీ జాన్’ అనే బాలీవుడ్ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది. మొదటి ఆట నుండే యావేరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడం కష్టమే అని అంటున్నారు కానీ, వామిక క్యారక్టర్ కి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ టీం చేసుకున్న ప్రైవేట్ పార్టీ నుండి బయటకి వస్తున్నప్పుడే లేటెస్ట్ గా మనం చూస్తున్న ట్రెండింగ్ వీడియో బయటకి వచ్చింది. ఇప్పుడు ఇంత క్యూట్ గా కనిపిస్తున్న వామిక గబ్బి ఒకప్పుడు కూడా క్యూట్ గానే కనిపించేది. కానీ చాలా బొద్దుగా , వయస్సున్న అమ్మాయిలాగా కాస్త అనిపించేది. ఈమె వయస్సు 30 ఏళ్ళు. సన్నబడిన తర్వాత 20 ఏళ్ళ అమ్మాయిగా కనిపిస్తుంది. ఇక నుండి ఈమెకి టాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.