YCP Youth Leaders : వైసీపీలో చాలామంది యువనేతలు అంతర్మధనం చెందుతున్నారు. రాజకీయంగా సైలెంట్ గా ఉండడమే మేలని భావిస్తున్నారు. 2029 ఎన్నికల నాటికి.. పరిస్థితికి తగ్గట్టు అడుగులు వేయాలని చూస్తున్నారు. జగన్ ను నమ్మి తమ రాజకీయ జీవితాన్ని ఇబ్బందుల్లో పెట్టుకున్నామని ఎక్కువమంది ఆందోళన చెందుతున్నారు. అటువంటివారు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి జగన్ వైఖరిని తప్పుపడుతున్నారు. వైసిపి పాలనలో వైఫల్యాలను పరోక్షంగా అంగీకరిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. తద్వారా తమపై ప్రభుత్వం దృష్టి పడకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే ప్రస్తుతం వైసీపీలో సీనియర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జూనియర్ లు మాత్రం తిరుగుబాటు సంకేతాలు పంపుతున్నారు. చాలామంది యువ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జక్కంపూడి రాజా జగన్ తీరుపై పరోక్ష విమర్శలు చేశారు. సీఈవో లో ధనుంజయ రెడ్డిని తమకు అడ్డంగా పెట్టి నిండా ముంచేశారని ఆరోపణలు చేశారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ కూడా అడ్డగోలుగా మాట్లాడారు. అనవసరంగా పవన్ కళ్యాణ్ ను కెలికి తప్పు చేశామన్నట్టు వ్యాఖ్యానించారు. జగన్ కు ఏమీ తెలియదని.. అందుకే లిక్కర్ బ్రాండ్లు, ఇతర విషయాల్లో తప్పులు జరిగాయని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ అదే మాట చెబుతున్నారు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సైతం జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అయితే మొదట్లో ఈవీఎంలు అంటూ హడావిడి చేశారు. కానీ ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ చర్యలను తప్పుపడుతున్నారు. అప్పుడే విమర్శలకు దిగడం మంచిది కాదని.. కొంత సమయం ఇవ్వాలని హితబోధ చేస్తున్నారు. అయితే వీరే కాకుండా చాలామంది జూనియర్లు జగన్ వైఖరి పై అసంతృప్తితో ఉన్నారు. కానీ కొంతమంది బయటపడ్డారు. మిగతావారు లోలోపున బాధపడుతున్నారు.
* సీనియర్లు మౌనం
వైసీపీ ఓటమి తర్వాత సీనియర్లు సైలెంట్ అయ్యారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటివారు సైతం మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం మానేశారు. ధర్మాన ప్రసాదరావు లాంటివారు రాజకీయ సన్యాసం తీసుకోవాలని చూస్తున్నారు. క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని భావిస్తున్నారు. వ్యాపారాలతో సంబంధం ఉన్న వైసీపీ నేతలు పా
+-కూడా భయపడుతున్నారు. ఎన్నికల్లో చాలామంది రాజకీయ వారసులు పోటీ చేయాలని భావించారు. కానీ జగన్ మాత్రం కొంతమందికి అనుమతి ఇచ్చారు. మిగతా వారికి మొండి చేయి చూపారు. అయితే టిక్కెట్లు దక్కని వారసులు కొంత రిలాక్స్ అయ్యారు. ఒకవేళ టికెట్ ఇచ్చినా.. తాము ఓడిపోయే వారమని గుర్తు చేసుకుంటున్నారు. అందుకే జగన్ విషయంలో చాలా ఆలోచనతో ఉన్నారు. ఎన్నికల నాటికి వైసిపి పుంజుకుంటే ఆపార్టీలో కొనసాగుదామని.. లేకుంటే అప్పటి పరిస్థితులకు తగ్గట్టు ఆలోచన చేసేందుకు సిద్ధపడుతున్నారు. అంతవరకు తటస్థంగా కొనసాగాలని డిసైడ్ అయ్యారు.
* ముఖం చాటేస్తున్న నాయకులు
ప్రస్తుతం మాత్రం ఏ జిల్లాలో కూడా వైసిపి నేతలు పెద్దగా బయటకు కనిపించడం లేదు. చివరకు కడప జిల్లాలో సైతం నేతలు ముఖం చాటేస్తున్నారు. మొన్నటికి మొన్న ఢిల్లీలో జరిగిన ధర్నాకు సైతం యువ నేతలు హాజరు కాలేదు. కనీసం వారి ప్రకటనలు కూడా ఎక్కడా కనిపించడం లేదు. గతంలో వైసీపీకి యువనేతలే బలంగా ఉండేవారు. ఇప్పుడు అదే నేతలు ముఖం చాటేస్తుండడం విశేషం.