https://oktelugu.com/

The Kerala Story Collections: బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సంచలనం ‘ది కేరళ స్టోరీ’..3 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఎంతో తెలుసా!

కేరళ లో అమ్మాయిలకు మతమార్పిడి చేయించి టెర్రరిస్టు క్యాంపు కి బలవంతంగా పంపిన యదార్ధ ఘటనని ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.

Written By:
  • Vicky
  • , Updated On : May 8, 2023 / 03:36 PM IST
    Follow us on

    The Kerala Story Collections: ఈమధ్య యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకొని దర్శకులు తెరకెక్కిస్తున్న సినిమాలకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు.సినిమాలో పెద్ద నటీనటులు ఉన్నారా లేదా అని ఇప్పుడు ఎవ్వరూ చూడడం లేదు, కంటెంట్ లో దమ్ము ఉందా లేదా అని మాత్రమే చూస్తున్నారు. కంటెంట్ లో సత్తా ఉంటే, స్టార్ హీరో సినిమాకి, ఊరు పేరు తెలియని హీరో సినిమాకి అసలు తేడానే లేకుండా పోయింది.ఆ రేంజ్ లో వసూళ్లు వస్తున్నాయి.

    గత ఏడాది విడుదలైన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం ఇందుకు ఒక ఉదాహరణ. మొదటిరోజు కేవలం కోటి రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఫుల్ రన్ లో 375 కోట్ల రూపాయిలు వసూలు చేసింది. ఆ తర్వాత ‘కాంతారా’ చిత్రం కూడా అదే రేంజ్ వసూళ్లను రాబట్టింది.ఈ రెండు సినిమాలు లాగానే ఇప్పుడు ‘ది కేరళ స్టోరీ’ అనే చిత్రం కలెక్షన్ల సునామి సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది.

    కేరళ లో అమ్మాయిలకు మతమార్పిడి చేయించి టెర్రరిస్టు క్యాంపు కి బలవంతంగా పంపిన యదార్ధ ఘటనని ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. దాంతో ఈ చిత్రానికి 8 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. బాలీవుడ్ లో టాక్ వచ్చిన సినిమాలకు మొదటి రోజుకంటే శనివారం మరియు ఆదివారం ఎక్కువ వసూళ్లు వస్తాయనే విషయం అందరికీ తెలిసిందే.ఈ చిత్రానికి కూడా అదే జరిగింది.

    రెండవ రోజు 11 కోట్ల 22 లక్షల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, మూడవ రోజు ఏకంగా 16 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది.అంటే మొదటి రోజు కంటే రెండింతలు ఎక్కువ వసూళ్లు అన్నమాట.ఇదే ఫ్లో ని కొనసాగిస్తూ ముందుకి పోతే రాబొయ్యే రోజుల్లో ఈ సినిమా కూడా 300 కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.