https://oktelugu.com/

Virupaksha Hindi Collections: ‘విరూపాక్ష’ హిందీ 3 రోజుల వసూళ్లు.. బ్రేక్ ఈవెన్ కష్టమేనా?

మూడు వారాలు పూర్తి అయినా కూడా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూస్తూనే ఉన్నారు, ఓటీటీ ట్రెండ్ ని తట్టుకొని ఈ చిత్రం ఇంత వసూళ్లను రాబడుతుంది అంటే ఆడియన్స్ కంటెంట్ బాగుంటే ఏ రేంజ్ లో ప్రోత్సహిస్తారో అర్థం చేసుకోవచ్చు.

Written By:
  • Vicky
  • , Updated On : May 8, 2023 3:32 pm
    Follow us on

    Virupaksha Hindi Collections: రీసెంట్ గా ప్రేక్షకులను థియేటర్స్ లో భయపెట్టేసిన చిత్రం సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన ‘విరూపాక్ష’. హారర్ థ్రిల్లర్ మూవీ లవర్స్ కి ఈ సినిమా ఒక కనులపండుగ లాగ అనిపించింది, అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సమ్మర్ లో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పటికే తెలుగు వెర్షన్ లో 44 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.

    మూడు వారాలు పూర్తి అయినా కూడా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూస్తూనే ఉన్నారు, ఓటీటీ ట్రెండ్ ని తట్టుకొని ఈ చిత్రం ఇంత వసూళ్లను రాబడుతుంది అంటే ఆడియన్స్ కంటెంట్ బాగుంటే ఏ రేంజ్ లో ప్రోత్సహిస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇది ఇలా ఉండగా పాన్ ఇండియన్ ఆడియన్స్ కి కూడా థియేటర్స్ లో అద్భుతమైన అనుభూతిని ఇవ్వడానికి ఈ చిత్రాన్ని రీసెంట్ గానే హిందీ, తమిళం మరియు మలయాళం వెర్షన్స్ లో విడుదల చేసారు.

    ముందుగా హిందీ లో మూడు రోజులకు కలిపి ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము. ఈ చిత్రాన్ని హిందీ లో దబ్ చేసి, థియేటర్స్ లో విడుదల చెయ్యడానికి నిర్మాతలకు అయిన ఖర్చు రెండు కోట్ల రూపాయిలు. అంటే ఈ సినిమా హిందీ లో బ్రేక్ ఈవెన్ అయ్యి , సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకోవాలంటే కచ్చితంగా రెండు కోట్ల రూపాయలకు పైగా షేర్ ని రాబట్టాల్సిందే.

    కానీ మూడు రోజులకు కలిపి ఈ సినిమా కేవలం 50 లక్షల రూపాయిల షేర్ ని మాత్రమే వసూలు చేసింది.అంటే ఈ చిత్రం హిందీ ఆడియన్స్ కి ఇంకా చేరుకోలేదు అన్నమాట.అయితే హిందీ లో లాంగ్ రన్ ఉంటుంది కాబట్టి, తదుపరి వీకెండ్ లో ఈ సినిమా డీసెంట్ స్థాయి హోల్డ్ ని కనబర్చినా బ్రేక్ ఈవెన్ చాలా సులువుగా అయిపోతుందని అనుకుంటున్నారు ట్రేడ్ పండితులు, చూడాలి మరి.