https://oktelugu.com/

ఇండస్ట్రీ చూపంతా ప్రభాస్ పైనే.. మూడు సిమాలకే వెయ్యి కోట్లు..!

యంగ్ రెబల్ స్టార్.. డార్లింగ్ ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ‘బాహుబలి’తో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్.. ‘సాహో’తో ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దీంతో ప్రభాస్ మూవీ కోసం బాలీవుడ్ జనాలు సైతం అత్రుతగా ఎదురుచూస్తున్నారు. Also Read: డబ్బుల కోసం ఆ పని చేయలేనంటున్న యాంకర్ విష్ణుప్రియ..! ప్రభాస్ కు ఉన్న క్రేజ్ దృష్టిలో ఉంచుకొని నిర్మాతలు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 27, 2020 / 12:12 PM IST
    Follow us on


    యంగ్ రెబల్ స్టార్.. డార్లింగ్ ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ‘బాహుబలి’తో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్.. ‘సాహో’తో ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దీంతో ప్రభాస్ మూవీ కోసం బాలీవుడ్ జనాలు సైతం అత్రుతగా ఎదురుచూస్తున్నారు.

    Also Read: డబ్బుల కోసం ఆ పని చేయలేనంటున్న యాంకర్ విష్ణుప్రియ..!

    ప్రభాస్ కు ఉన్న క్రేజ్ దృష్టిలో ఉంచుకొని నిర్మాతలు ‘డార్లింగ్’పై కోట్లు ఖర్చుపెట్టడానికి ఏమాత్రం కూడా ఆలోచించడం లేదు. ‘సాహో’ తర్వాత ప్రభాస్ చేస్తున్న మూడు సినిమాలు కూడా భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్నాయే కావడం విశేషం. ‘రాధేశ్యామ్’.. ‘ఆదిపురుష్’.. నాగ్ అశ్విన్ మూవీలన్నీ కూడా పాన్ ఇండియా లెవల్లో నిర్మాణం అవుతున్నాయి.

    ప్రభాస్ కటౌట్ కు తగ్గట్టుగా దర్శక, నిర్మాతలు ఈ మూడు సినిమాల బడ్జెట్లో నిర్మిస్తున్నారు. ఈ మూడు సినిమాల బడ్జెట్ వెయ్యి కోట్లు దాటిపోవడం ప్రభాస్ స్టామినాకు నిదర్శనంగా కన్పిస్తోంది. ప్రభాస్ పై ఎన్ని కోట్లు కుమ్మరించినా తిరిగి వస్తుందనే నమ్మకంతోనే నిర్మాతలు ఖర్చుకు ఏమాత్రం వెనుకడటం లేదని తెలుస్తోంది.

    ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో ప్రభాస్‌ జోడీగా బుట్టబొమ్మ  పూజాహెగ్డే నటిస్తోంది. పీరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్‌’ దాదాపు రూ. 250 కోట్లతో రూపుదిద్దుకుంటుందని సమాచారం. ఈ మూవీలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో నటిస్తుండగా.. పూజా మ్యూజిక్‌ టీచర్‌గా కన్పించనుంది. ఈ మూవీ తెలుగుతోపాటు తమిళ.. మలయాళ.. హిందీ భాషల్లో విడుదల కానుంది.

    Also Read: బిగ్ బాస్ ట్వీస్ట్.. ఈవారంలో రీఎంట్రీ… ఎలిమినేషన్ లేవా?

    ‘రాధేశ్యామ్’ తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైంటిఫిక్ మూవీలో.. బాలీవుడ్ దర్శకుడు ఓంరావత్ తెరకెక్కించనున్న ‘ఆదిపురుష్’లో నటించనున్నాడు. అయితే ముందుగా సెట్స్ పైకి ‘ఆదిపురుష్’ వెళ్లేలా కన్పిస్తోంది. ‘ఆదిపురుష్’ చిత్రయూనిట్ ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ డేట్ సైతం అనౌన్స్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్ లో జోష్ నింపింది. దాదాపు 450కోట్ల భారీ బడెట్లో ‘ఆదిపురుష్’ను టీ సిరీస్ నిర్మించనుంది.

    ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా నటించనుండగా లంకేష్ గా సైఫ్ అలీఖాన్ కన్పించబోతున్నాడు. సీత పాత్రపై క్లారిటీ రావాల్సింది. పలువురు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చినా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీని బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ తెరకెక్కిస్తున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ‘ఆదిపురుష్’ తర్వాత మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ తో ఓ సైంటిఫిక్ కథాంశంతో మూవీ తీయబోతున్నాడు. ఈ మూవీలో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ నటిస్తోంది. దాదాపు 300కోట్ల భారీ బడ్జెట్లో వైజయంతీ బ్యానర్స్ ఈ సినిమా నిర్మించనుందని సమాచారం. ప్రభాస్ ఒక్కడిపైనే వేలకోట్ల వ్యాపారం జరుగుతుండటం డార్లింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కు నిదర్శనంగా కన్పిస్తోంది.