Bahubali Shooting secret : ఎస్ఎస్ రాజమౌళి తొలిసారిగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించిన చిత్రం బాహుబలి. 2015లో తొలి భాగం విడుదల కాగా, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే సస్పెన్స్ తో రెండో పార్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూసేలా చేశాడు. పార్ట్ -2 విడుదలయ్యే దాకా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. అంతలా ప్రేక్షకులను ఆసక్తిగా ఎదురు చూసేలా చేశాడు రాజమౌళి. ఈ సినిమా అటు ప్రభాస్ ను పాన్ ఇండియాను స్టార్ ను చేయడంతో పాటు సౌత్ సినిమాకు పాన్ ఇండియాకు దారులు వేశాడు రాజమౌళి. ఇక దర్శకుడిగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. బాహుబలి-2 కోసం ఎదురు చూసినంతగా మరే భారతీయ సినిమా ఇంతలా ప్రేక్షకులు ఎదురు చూసిన సందర్భాలు లేవు. బాహుబలి-2 విడుదలయ్యాక ఎన్నో సంచలనాలు సృష్టించింది. ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. కొన్నేళ్ల దాకా బాహుబాలి, నాన్ బాహుబలి రికార్డ్స్ అని పరిగణించాల్సి వచ్చింది.
నాలుగేళ్లు ఒక్క సినిమాకే అంకితం
ఈ సినిమాలో బాహుబలిగా చేసిన ప్రభాస్ నాలుగేళ్లు మరో మూవీ చేయలేదు. ఒక్క సినిమా కోసం నాలుగేళ్లు అంకితం చేశాడు. ఇక ఈ సినిమా కోసం నటనా పరంగానే కాకుండా ఫిజికల్ గా ప్రభాస్ బాగా మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. ఈ సినిమా కోసం ప్రభాస్ దాదాపు 150 కిలోల వరకు తన బరువును పెంచుకున్నాడు. తన ఆహర్యంలో రాజసం ఉట్టిపడేలా మేకోవర్ అయితే మామూలు విషయం కాదు. ఫిజికల్ గానే కాకుండా అటు కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నాడు. ఇక ఈ సినిమా విజయంలో భారీ గ్రాఫిక్స్ కూడ ప్రధాన పాత్ర పోషించింది. ఒక్కో విజువల్ ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతిని ఇచ్చింది. సినిమాలో సెట్టింగులు అద్భుతమనే చెప్పాలి. రాజమౌళి ఊహలకు తగ్గట్లుగా ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ రామోజీ ఫిల్మ్ సిటీలో అద్భుతంగా సెట్లు వేశాడు.
ప్రభాస్ ను మోయలేక కూలబడిన బుల్లెట్
బాహుబలి కోసం ఫిజికల్ గా మరింతగా ఆకట్టుకున్నాడు ప్రభాస్. అయితే ఆ పెరిగిన బరువు కారణంగా సినిమా షూటింగ్ లో కొన్ని ఇబ్బందులు తప్పలేదు. ఈ సినిమాలో ప్రభాస్ గుర్రంపై వెళ్లే సీన్లు ఉన్నాయి. అందులో ప్రభాస్ కోసం స్పెషల్ గా తెప్పించిన గుర్రం పేరు బుల్లెట్. ఈ గుర్రానికి కూడా ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చారు. కానీ తీరా షూటింగ్ సమయం వచ్చే సరికి ఈ గుర్రం(బుల్లెట్) ప్రభాస్ మోయలేకపోయింది. దీంతో అటు రాజమౌళి కంగారు పడిపోయాడు. దీంతో ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ఆర్టిఫిషియల్ గుర్రం చేయించాడు. దానిపైనే కొన్ని సీన్లు షూట్ చేశాడు. అలా సాబు సిరిల్ డైరెక్టర్ రాజమౌళి టెన్షన్ పొగొట్టుకున్నాడు. అయితే ఈ సినిమా మేకింగ్ వీడియోస్ బయటికి వచ్చినా ఈ బుల్లెట్ (గురం) గురించి మాత్రం బయటికి రానివ్వకుండా ఇప్పటి వరకు జాగ్రత్త పడ్డారు.
– అజయ్ యాదవ్
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: The horse bullet that upset rajamouli by not being able to carry prabhas in baahubali shooting bullet
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com