Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కి కోలుకోలేని షాక్ ఇచ్చిన హై కోర్టు.. జర్నలిస్ట్ మూర్తి దెబ్బ అదుర్స్!

జ్యోతిష్యుడిగా బోలెడంత నెగటివిటీ ని మూటగట్టుకున్నాడు వేణు స్వామి. ఈయనని తిట్టని వారంటూ ఎవ్వరూ ఉండరంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదేమో. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఈయన తన భార్య తో కలిసి టీవీ 5 జర్నలిస్ట్ మూర్తిపై సంచలన ఆరోపణలు చేస్తూ ఒక వీడియో విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

Written By: Vicky, Updated On : September 13, 2024 5:34 pm

Venu Swamy

Follow us on

Venu Swamy: సెలెబ్రిటీలు, రాజకీయ నాయకుల జీవితాలకు సంబంధించిన జాతకాలు వాళ్ళ అనుమతి లేకుండా చెప్తూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్ లో ఉండే సెలబ్రిటీస్ లో ఒకరు వేణు స్వామి. ఆయన నోటికి ఆనకట్ట అనేది ఉండదు అనే విషయం సోషల్ మీడియా ని రెగ్యులర్ గా అనుసరించే ప్రతీ ఒక్కరికి తెలుసు. శుభమా అంటూ పెళ్లి చేసుకున్న కొత్త జంట విడిపోతుంది అనడం, అప్పుడే పుట్టిన పసిబిడ్డకు భవిష్యత్తులో చెవులు పని చెయ్యవు, కాళ్ళు పని చెయ్యవు అనడం, ఇలా ఎల్లప్పుడూ అశుభాలు మాట్లాడే జ్యోతిష్యుడిగా బోలెడంత నెగటివిటీ ని మూటగట్టుకున్నాడు వేణు స్వామి. ఈయనని తిట్టని వారంటూ ఎవ్వరూ ఉండరంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదేమో. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఈయన తన భార్య తో కలిసి టీవీ 5 జర్నలిస్ట్ మూర్తిపై సంచలన ఆరోపణలు చేస్తూ ఒక వీడియో విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ వీడియో లో వీళ్లిద్దరు మాట్లాడుతూ జర్నలిస్ట్ మూర్తి మమల్ని తన మనుషులతో మానసిక వేదనకు గురి చేస్తున్నాడని, గత 8 నెలల నుండి తమ టీవీ ఛానల్ లో నా పై అసత్య ప్రచారాలు చేస్తున్నాడని, సెటిల్మెంట్ కోసం తనను 5 కోట్ల రూపాయిలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారని, మేము ఆత్మహత్య చేసుకుంటే అందుకు కారణం జర్నలిస్ట్ మూర్తి నే అంటూ ఒక వీడియో చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మూర్తి కూడా చాలా ఘాటుగా స్పందించాడు. పోలీస్ స్టేషన్ లో వేణు స్వామి పై కంప్లైంట్ కూడా ఇచ్చాడు. ఈ విషయం లో నేడు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. వేణు స్వామి పై కేసు నమోదు చెయ్యాలని పోలీసులను నాంపల్లి హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజలను వేణు స్వామి జాతకాల పేరుతో మోసం చేస్తున్నాడని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసి జాతకం చెప్పినట్టు, ఆయన ఫోటోని మార్ఫ్ చేయడం పై కూడా ఇటీవల కొంతమంది కోర్టు లో పిటీషన్ దాఖలు చేసారు.

దీనిపై న్యాయ విచారణ చేపట్టిన న్యాయస్థానం వేణు స్వామి పై కేసు నమోదు చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. మరోపక్క జర్నలిస్ట్ మూర్తిపై చేసిన ఆరోపణల్లో కూడా ఎలాంటి ఆధారాలు లేవని, సరైన ఆధారాలు చూపించకపోతే న్యాయ పరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది. మరి దీనిపై వేణు స్వామి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. మరోపక్క వేణు స్వామి పై హై కోర్టు తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియా లో సర్వత్రా ప్రశంసలు కురుస్తుంది. పవిత్రమైన జాతక విద్య ని అపహాస్యం చేస్తూ తన పబ్లిసిటీ కోసం ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్న వేణు స్వామి పై కఠినమైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో మళ్ళీ ఆయన ఇలాంటి దారిలో నడిచేందుకు వీలు లేకుండా బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు.