Star Heroine: తెలుగు సినీ పరిశ్రమలో ఆమెకు సహజనటి అని పేరు. పైగా హీరోయిన్ గా అలనాటి అందరి స్టార్ హీరోల సరసన నటించింది. అలాగే ఆ తర్వాత కాలంలో కూడా మెగాస్టార్, కమల్ హాసన్ లాంటి వాళ్లతో కూడా ఆడిపాడింది. దీనికి తోడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆమె ఒక వెలుగు వెలిగింది. మరి ఆ వెలుగుల వెల్లువ ఎటు పోయిందో ? తీసుకున్న భారీ రెమ్యునరేషన్స్ ఏమైపోయాయో ? అసలు సుదీర్ఘమైన కెరీర్.. అలాంటి సహజనటి సహజంగా ఆర్ధిక ఇబ్బందులు ఉండకూడదు.

కానీ ఈ సహజనటి పరిస్థితి మరోలా ఉంది. వందల సినిమాలు చేసినా.. ఆమె ఆర్ధిక పరిస్థితి మాత్రం ఎప్పటికప్పుడు ఇబ్బందిగానే సాగుతూ వచ్చింది. అసలు ఎన్ని సినిమాలు చేసారన్నది కూడా లెక్కా జమా లేకుండా సినిమాలు చేసినా.. ఆమెకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ? ఈ మధ్య ఆమె అమెరికా పోయి అక్కడ ఓ చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ?
కొన్నాళ్ళు పాటు కెరీర్ ఫామ్ లో ఉంటేనే.. బాగా సంపాదించి లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. కానీ ఈ సీనియర్ హీరోయిన్ మాత్రం లైఫ్ లో సెటిల్ కాలేకపోయింది. రిటైర్ మెంట్ లైఫ్ ను హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన వయసులో మళ్ళీ కొత్త ప్రయాణాలు మొదలు పెట్టాల్సి వచ్చింది. సహజంగా నాలుగు డబ్బులు వెనకేసుకునే అలావాటు ఆమెకు ముందు నుంచీ లేదు.
దీనికి తోడు మధ్యలో నిర్మాణంలోకి దిగింది. అందుకు కారణం ఆమె భర్తే. అయితే, ఆమెకు సినిమాల నిర్మాణం అసలు కలిసి రాలేదు. ఓ దశలో మొత్తం ఆస్తి పోయింది. మొత్తానికి ఆమెకు ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువైపోయాయి. నిజానికి ఈ వార్త గత ఆరేళ్ల నుంచి వినిపిస్తూనే ఉంది. కాకపోతే.. రీసెంట్ గా ఆమె హైదరాబాద్ లోని సొంత ఇల్లును కూడా అమ్ముకున్నట్లు తెలుస్తోంది.
Also Read: Sonu Sood: చిరు వ్యాపారులకు అండగా ఉండాలంటున్న సోనూసూద్.. ట్వీట్టర్లో వీడియో వైరల్!
మరోపక్క సినిమాలు కూడా తగ్గాయి. పైగా గతంలో తనకు ఇచ్చిన రేంజ్ రెమ్యునరేషన్స్ ఇప్పుడు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దాంతో సంపాదన లేదు. చేతికి అందిన పిల్లలు ఎలాంటి సపోర్ట్ చేసే పొజిషన్ లో లేరు. అందుకే, కొడుకు చేత అమెరికాలో ఓ చిన్న హోటల్ పెట్టించింది. పైగా కొన్నాళ్ళు నుంచి అక్కడే ఉంటూ హోటల్ ను ప్రమోట్ చేస్తోంది.
Also Read: Kalyan Ram: ఈ కథకు సెట్ కాదు, దర్శకుడి వాదన.. నా మార్కెట్ కి వర్కౌట్ కాదు, హీరో వాదన !