Supritha Debut Movie: సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియా ద్వారా క్రేజ్ సంపాదించింది. తల్లి కూతుళ్లు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు. గ్లామరస్ వీడియోలతో సందడి చేస్తుంటారు. ఇక సుప్రీత ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్ చేస్తూ తన అందాలతో ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇస్తుంటుంది. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా గ్లామరస్, కిల్లింగ్ లుక్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
సురేఖ వాణి తన కూతురితో కలిసి వెళ్లిన వెకేషన్స్, పార్టీలు వంటి వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. కాగా సుప్రీత కూడా తల్లి వలె సిల్వర్ స్క్రీన్ పై మెరవాలని ఆరాటపడుతుంది. ఎట్టకేలకు ఆ కల నెరవేరనుంది. సుప్రీతకు హీరోయిన్ గా అవకాశం వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్ అమర్ దీప్ తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది. అమర్ దీప్ తో ఆమె రొమాన్స్ చేయనుంది.
ఈ చిత్ర లాంఛింగ్ ఈవెంట్ లో సురేఖ వాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. సుప్రీతను సినీ ఇండస్ట్రీకి తీసుకురావడానికి చాలా భయపడ్డానని, ఆడపిల్ల కాబట్టి అందరి తల్లుల లాగే భయపడినట్లు చెప్పింది. అమర్ ఆమెకు తమ్ముడు లాంటోడు అని సురేఖ వాణి అన్నారు. ఇంత మంచి టీం దొరకడంతో ధైర్యంగా ఉన్నానని సురేఖ చెప్పుకొచ్చింది. అందుకే ఎలాంటి భయం లేకుండా తన కూతురిని వారి చేతుల్లో పెడుతున్నట్లు సురేఖ వాణి పేర్కొంది.
అమర్ దీప్ కి కూడా ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. ఇప్పటివరకు సీరియల్స్ లో నటించిన అమర్ దీప్ ఇక సినిమాల్లో రాణించనున్నాడు. బిగ్ బాస్ ద్వారా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించాడు. ఇటీవల అయోధ్య లో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా అమర్,తేజు చేసిన ‘ అయోధ్య రామ ‘ పాట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. కాగా అమర్ దీప్ ఈటీవీ ప్లస్ లో ఒక సీరియల్ చేస్తున్నాడు. త్వరలోనే తన కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.