Mehreen Pirzada: ‘మెహ్రీన్’ కెరీర్ అసలే అంతంత మాత్రంగా సాగుతుంది. ఇలాంటి టైమ్ లో ఏ హీరోయిన్ అయినా వచ్చిన అవకాశాలను ఒడిసి పట్టుకోవాలని ఆరాట పడుతుంది. పనిలోపనిగా ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తుంది. కానీ, ఇక్కడే ‘మెహ్రీన్’ తెలివితేటలు చూపిస్తుంది. తన దగ్గరకు ఓటీటీ ఆఫర్లతో వచ్చిన నిర్మాతలను మభ్య పెడుతోంది. ఈ మధ్య ఓ వెబ్ సిరీస్ ఐడియాతో ఓ యంగ్ డైరెక్టర్ ఈ హీరోయిన్ ను సంప్రదించాడు. కానీ, ఓటీటీలో నటించడం ‘మెహ్రీన్’కు ఇష్టం లేదు.
అలా అని కథను వదులుకోవడానికి ‘మెహ్రీన్’ ఇష్టపడలేదు. ఈ కథను సినిమా చేద్దామని ఆ యంగ్ డైరెక్టర్ ను ఊరించింది. ‘మెహ్రీన్’తో ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ ఏమిటయ్యా ? అంటూ ఆ డైరెక్టర్ దగ్గర ఉన్న నిర్మాత చేతులు ఎత్తేశాడు. దీంతో, ఆ డైరెక్టర్ కి నిర్మాత లేకుండా పోయాడు. ‘నేనే చూస్తాను నిర్మాతను’ అని అభయం ఇచ్చింది. ఇప్పటికే ఈ అభయం ఇచ్చి నాలుగు నెలలు అయ్యింది.
Also Read: Rashmika Mandana: రష్మిక పై ఆ సీన్స్ తీస్తారట.. రణబీర్ కూడా రెడీ !
నిర్మాతని చూడలేదు. కట్ చేస్తే.. నానాపాట్లు పడి ఆ డైరెక్టరే మరో నిర్మాతను చూసుకున్నాడు. మళ్ళీ వ్యవహారం మొదటికే వచ్చింది. సినిమాకు కావాల్సిన హంగులు, ఎలిమెంట్స్ అన్నీ ఈ కథలో ఉన్నాయని.. కాబట్టి ఈ కథను సినిమాగా మార్చి చేద్దామంటే వెంటనే కాల్షీట్లు ఇస్తానని కబుర్లు చెప్పుకొచ్చింది ‘మెహ్రీన్’. వాళ్ళు కూడా ఊ అన్నారు. కానీ.. రెమ్యునరేషన్ విషయంలో మరో మెలిక పెట్టింది.
తనకు 80 లక్షలు ఇవ్వాలని ‘మెహ్రీన్’ కండిషన్ పెట్టింది. నిజానికి ఆ కథ సినిమాగా పనికిరాదు. బి, సి సెంటర్లలో ఈ కథ పెద్దగా వర్కౌట్ కాదు. ఇవన్నీ ఆలోచించే సదరు దర్శకుడు వెబ్ సిరీస్ వైపు మొగ్గు చూపాడు. కానీ ‘మెహ్రీన్’కి మాత్రం వెబ్ లో చేయడం ఇష్టం లేక, ఇన్నాళ్లు సినిమా చేద్దామంటూ కలరింగ్ ఇచ్చింది.
ఇప్పుడు ఎక్కువ రెమ్యునరేషన్ అంటూ కవరింగ్ చేస్తోంది. అసలు ఇష్టం లేకపోతే తిప్పించుకోవడం ఎందుకు ? రోజుకొక కబురు చెప్పడం ఎందుకు ? ఏది ఏమైనా ఒక అప్ కమింగ్ డైరెక్టర్ జీవితంతో ఆడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ‘మెహ్రీన్’కే తెలియాలి.
Also Read: Janasena: స్పీడ్ పెంచిన జనసేనాని.. పవన్ ప్రసంగాల్లో పెరిగిన వాడీవేడీ
Recommended Videos: