Hero Siddharth: 2000 దశాబ్దం ప్రారంభం లో టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన హీరోలలో ఒకడు సిద్దార్థ్..నువ్వొస్తానంటే నేను వద్దంటానా, బొమ్మరిల్లు వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో స్టార్ హీరో రేంజ్ స్టార్ డమ్ ని అందుకున్నాడు ఆయన..ఆ తర్వాత రెండు మూడు ఫ్లాప్స్ పడినప్పటికీ కూడా ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న హీరో గా సిద్దార్థ్ కి మంచి పేరు ఉంది..ఇక ఆ తర్వాత హిందీ లో మరియు తమిళం లో కూడా అత్యధిక సినిమాలు చేసి అక్కడ కూడా హిట్స్ కొట్టాడు..ఇక టాలీవుడ్ లో చాలా కాలం తర్వాత ఆయన రీ ఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం మహా సముద్రం..శర్వానంద్ మరియు సిద్దార్థ్ ముల్టీస్టార్ర్ర్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది..సిద్దార్థ్ క్యారక్టర్ డైరెక్టర్ సరిగా రాసుకోకపోవడం వల్లే ఈ సినిమా ఆ స్థాయిలో ఫ్లాప్ అయ్యిందని సినీ విశ్లేషకులు అంటుంటారు..ఈ సినిమాలో సిద్దార్థ్ కి జోడి గా అదితి హయాద్రి నటించిన సంగతి మన అందరికి తెలిసిందే.

ఇది ఇలా ఉండగా ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిసున్నా వార్త ఏమిటి ఏమిటి అంటే సిద్దార్థ్ హీరోయిన్ అదితి హయాద్రి తో ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నాడని త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తుంది..ఇటీవల ముంబై లోని ఒక హోటల్ రూమ్ నుండి వీరిద్దరూ బయటకి రావడమే ఈ రూమర్స్ కి కారణమైంది..బయటకి వచ్చిన తర్వాత మీడియా రిపోర్టర్స్ ఫోటోలు తియ్యడం చూసి సిద్దార్థ్ వారిపై ఫైర్ అయ్యాడు..ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
Also Read: Liger Trailer: విజయ్ దేవరకొండ ‘లైగర్’ ట్రైలర్ పై క్రేజీ అప్ డేట్.. ఫ్యాన్స్ కి ఫుల్ కిక్కే

మహా సముద్రం సినిమా టైం లో సిద్దార్థ్ మరియు అదితి కి మధ్య ప్రేమ చిగురించింది అని..ఇప్పుడు వాళ్లిదరు డేటింగ్ చేసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్..సిద్దార్థ్ కి ఇలాంటి అఫైర్స్ మరియు రూమర్స్ కొత్తేమి కాదు..తరుచు వివాదాల్లోనే ఉంటారు ఆయన..సోషల్ మీడియా లో ఇటీవల అంతర్జాతీయ స్థాయి పేరు గడించిన సైనా నెహ్వాల్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి బాగా నెగటివిటీ తెచ్చుకున్నాడు..అంతే కాకుండా అప్పట్లో సమంత తో ఈయన నడిపిన ప్రేమాయణం కూడా మన అందరికి తెలిసిందే..ఇప్పుడు అదితి రావు హయాద్రి తో కూడా ఆయన మరో లవ్ ట్రాక్ నడపడం సిద్దార్థ్ పై సోషల్ మీడియా లో మరింత నెగటివిటీ పెంచింది.