Thank You Movie First Review: టాలీవుడ్ గత కొంత కాలం నుండి వరుస ఫ్లాప్స్ తో కాస్త స్లంప్ లో పడింది అనే చెప్పాలి..ఆచార్య మరియు రాధే శ్యామ్ సినిమాలు మినహా ఈ ఏడాది విడుదలైన స్టార్ హీరోల సినిమాలన్నీ కమర్షియల్ గా మంచి సక్సెస్ ని సాధించాయి..కానీ మీడియం రేంజ్ హీరోల సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి..హీరో నాని నటించిన అంటే సుందరానికి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిన కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది..ఇక ఆ తర్వాత గోపీచంద్ నటించిన పక్క కమర్షియల్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గానే మిగిలింది..ఇప్పుడు లేటెస్ట్ గా హీరో రామ్ నటించిన ‘ది వారియర్’ సినిమాకి కూడా మిశ్రమ స్పందనే వచ్చింది..ఇలా వరుస పరాజయాలతో డీలా పడిన టాలీవుడ్..ఇప్పుడు అక్కినేని నాగ చైతన్య హీరో గా నటించిన ‘థాంక్యూ’ మూవీ మీదనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నాయి..ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తున్నా సినిమా కావడం తో ఈ మూవీ పై ట్రేడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి..టీజర్ మరియు ట్రైలర్ కూడా ఈ చిత్రం పై ఆసక్తి పెంచేలా చేసింది.

మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమా కి సంబంధించిన మొట్ట మొదటి రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ఈ చిత్రానికి మనం సినిమా దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ గా ఈ సినిమాని ఆయన తీర్చిదిద్దినట్టు తెలుస్తుంది..ముఖ్యంగా సినిమాలోని మొదటి 40 నిమిషాలు నాగ చైతన్య కెరీర్ బెస్ట్ గా ఉండబోతుంది అట..హీరోయిన్ రాశి ఖన్నా మరియు నాగ చైతన్య మధ్య వచ్చే లవ్ సీన్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా ఉంటుందట..విక్రమ్ కె కుమార్ సినిమాలు అంటే కాస్త వెరైటీ గా ఉంటాయి..కథ మరియు కథనం విషయం లో కూడా సరికొత్త ట్రీట్మెంట్ ఉంటుంది..థాంక్యూ సినిమా టేకింగ్ కూడా అదే విధంగా ఉంటుందట.
Also Read: Liger Trailer: విజయ్ దేవరకొండ ‘లైగర్’ ట్రైలర్ పై క్రేజీ అప్ డేట్.. ఫ్యాన్స్ కి ఫుల్ కిక్కే

వరుస విజయాలతో కెరీర్ లో మంచి ఊపు మీదున్న నాగ చైతన్య ని ఈ సినిమా మరో లెవెల్ కి తీసుకెళ్లే విధంగా ఉండబోతుందని తెలుస్తుంది..అంతే కాకుండా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడం దిల్ రాజు చాలా ముఖ్యం..ఎందుకంటే ఇటీవలే హిందీ లో ఆయన రెండు భారీ డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకున్నాడు..బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ ఆయన చేసిన హిట్ మరియు జెర్సీ సినిమాలు ఆశించిన స్థాయి లో ఆడలేదు..దిల్ రాజు కి భారీ నష్టాలు తెచ్చాయి..దిల్ రాజు పట్టిందల్లా బంగారమే అనే బ్రాండ్ ఇమేజి కి దెబ్బ తీశాయి ఈ సినిమాలు..దీనితో మళ్ళీ తన బ్రాండ్ ఇమేజి ని రిపేర్ చేసుకునేందుకు ఈ సినిమా కచ్చితంగా ఉపయోగపడుతుంది అని ఆయన ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నాడు..మరి ఆయన నమ్మకం ని ఈ సినిమా ఎంత వరుకు నిలబెడుతుందో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.
[…] Also Read: Thank You Movie First Review: నాగ చైతన్య ‘థాంక్యూ’ మూవీ … […]
[…] Also Read: Thank You Movie First Review: నాగ చైతన్య ‘థాంక్యూ’ మూవీ … […]