Baby Movie Remuneration : ‘బేబీ’ సినిమా హీరో, హీరోయిన్ల మరీ తక్కువ.. కానీ డైరెక్టర్ కే ఎక్కువ రెమ్యూనరేషన్.. ఎందుకో తెలుసా?

హీరో ఆనంద్ దేవరకొండకు రూ.80 లక్షల పారితోషికం, హీరోయిన్ విష్ణు చైతన్యకు రూ.20 లక్షలు, డైరెక్టర్ సాయి రాజేశ్ కు మాత్రం రూ. కోటి రూపాయల వరకు ఇచ్చారని అంటున్నారు. 

Written By: Chai Muchhata, Updated On : July 23, 2023 6:27 pm
Follow us on

Baby Movie Remunerations : ఈమధ్య చిన్న సినిమాలో బ్లాక్ బస్టర్ గా నిలుస్తున్నాయి. వందల కోట్ల బడ్జెట్ పెట్టి.. ఎంతో ఆడంబరంగా వస్తున్న సినిమాలను కాదని సగటు ప్రేక్షకుడు కంటెంట్ ఉన్న సినిమాకే ప్రాధాన్యం ఇస్తున్నాడు. అందుకే చాలా మంది కథను నమ్మొకొని తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీస్తున్నారు. కానీ కొన్ని సినిమాలకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. అంతో ఇంతో హిట్ అవుతుందనుకున్న సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. అలాంటిదే బేబీ మూవీ. ఈ సినిమాను SKN నిర్మించగా.. సాయి రాజేశ్ డైరెక్షన్ చేశారు. ఈ సినిమా కోసం రూ.7 నుంచి 8 కోట్ల బడ్జెట్ వచ్చినట్లు సమాచారం అయితే 9 రోజుల్లో రూ.60 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం హీరో, హీరోయిన్ల కంటే డైరెక్టర్ కు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది.
‘బేబీ’ సినిమాలో ఆనంద్ దేవరకొండ తో పాటు విష్ణు చైతన్య హీరో హీరోయిన్లుగా నటించారు. మరో హీరో విరాజ్ అశ్విన్ కూడా పోషించారు.లవ్, ఎమోషనల్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ యూత్ బాగా ఆకట్టుకుంది. కొన్ని సీన్స్ తమ జీవితంలో జరిగినవే సినిమా తీశారంటూ కొందరు లవర్ష్ మళ్లీ మళ్లీ సినిమాను చూస్తున్నారు. దీంతో సినిమా రిలీజ్ అయి 9రోజులు గడుస్తున్నా కొన్ని థియేటర్లలో ప్రేక్షకులు కిటకిటలాడుతున్నారు. దీంతో కలెక్సన్ల సునామీ సృష్టిస్తోంది. మొన్నటి బలగం మూవీ తరువాత అంతటి ఘన విజయం సాధిస్తున్న మూవీ బేబీనే అని కొందరు అంటున్నారు.
ఈ క్రమంలో ఈ సినిమాలో హీరో, హీరోయిన్లకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో? అన్న చర్చ సాగుతోంది. అయితే ముందుగా ఏ అంచనాలు లేకపోవడంతో తక్కువ బడ్జెట్ తోనే సినిమా తీశారు. దీంతో వీరి రెమ్యూనరేషన్ కూడా తక్కువగానే ఉంది. వీరిలో హీరో ఆనంద్ దేవరకొండకు రూ.80 లక్షల పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. హీరోయిన్ విష్ణు చైతన్యకు రూ.20 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే హీరో, హీరోయిన్ల కంటే డైరెక్టర్ సాయి రాజేశ్ కు మాత్రం రూ. కోటి రూపాయల వరకు ఇచ్చారని అంటున్నారు.
అయితే అంత పారితోషికం తీసుకున్నందుకు సినిమాకు న్యాయం చేశారని అంటున్నారు.సినిమాను తక్కువ బడ్జెట్ తీసి ప్రేక్షకుల మనసు దోచుకున్నారని చెబుతున్నారు. 2014లో సంపూర్ణేష్ బాబు ‘హృదయ కాలేయం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సాయి రాజేశ్ ఆ తరువాత కొబ్బరి మట్ట, కలర్ ఫొటో సినిమాలు తీసి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు బేబీ సినిమాతో మరో ప్రభంజనం సృష్టించాడు. ఇలా వరుస హిట్ల సినిమాలు తీయడంతోనే ఆయన రెమ్యూనరేషన్ కోటి వరకు ఇచ్చారని చెబుతున్నారు.