Goat Movie OTT: తమిళనాడు లో ప్రస్తుతం సూపర్ స్టార్ రేంజ్ ని ఎంజాయ్ చేస్తున్న హీరో ఇళయ తలపతి విజయ్. ప్రస్తుతం ఈయనకి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఏ హీరోకి కూడా లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. తమిళనాడు లో ఒకవిధంగా చెప్పాలంటే సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ ని కూడా దాటేశాడు. ఓవర్సీస్ లో రజనీకాంత్ కి దరిదాపుల్లో వచ్చే హీరో ఒకప్పుడు ఉండేవాళ్ళు కాదు. కానీ విజయ్ కి ఇప్పుడు ఓవర్సీస్ లో టాక్ తో సంబంధం లేకుండా రజినీకాంత్ సినిమాలకు మించిన వసూళ్లు వస్తున్నాయి. ఎంతటి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కూడా కమర్షియల్ గా సూపర్ హిట్ చేయగల సత్తా విజయ్ కి వచ్చేసింది. ఒకప్పుడు చిరంజీవి, రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లాంటి సూపర్ స్టార్స్ కి మాత్రమే ఇలాంటి క్రేజ్ ఉండేది.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ అల్ టైం’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలై బ్లాక్ బస్టర్ వసూళ్లను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఆరంభం లో నెగటివ్ టాక్ వచ్చింది. కానీ సినిమాలో మంచి కంటెంట్ ఉండడంతో వసూళ్ల సునామీని సృష్టించింది. కేవలం తమిళనాడు నుండి 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇందులో విజయ్ హీరో గా, విలన్ గా ద్విపాత్రాభినయం చేసాడు. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న విజయ్ లాంటి హీరోలు, ఇలాంటి సైకో పాత్రలు చేయడం నిజంగా అభినందించదగ్గ విషయమే. ఎవ్వరూ ఇలాంటి సాహసాలు చేయరు, పైగా విజయ్ త్వరలో రాజకీయంగా యాక్టీవ్ అవ్వబోతున్నడు కూడా, ఇలాంటి సమయంలో కూడా ఆయన రిస్క్ తీసుకోవడం మామూలు విషయం కాదు. ఓటీటీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఈ చిత్రం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలుగు లో ఈ చిత్రం డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆరంభం లో వచ్చిన నెగటివ్ టాక్ ప్రభావం బలంగా పడింది.
ఆ కారణం చేత థియేటర్స్ లో ఈ చిత్రం ఎక్కువ కాలం నిలబడలేదు. అందుకే ఓటీటీ కోసం ఆడియన్స్ ఎదురు చూసారు. నిన్ననే ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వడం మొదలు పెట్టింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడం మరియు మలయాళం భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉంటుంది. వెంకట్ ప్రభు దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, స్నేహా హీరోయిన్స్ గా నటించారు. ఈ వారం ఓటీటీ ప్రియులు చూడదగ్గ చక్కటి చిత్రంగా ఈ సినిమా నిలుస్తుంది. ఆలస్యం చేయకుండా వెంటనే చూసేయండి. ఇది ఇలా ఉండగా ఈ సినిమా తర్వాత విజయ్ H వినోద్ దర్శకత్వం లో ఒక సినిమా చేయబోతున్నాడు, ఇదే ఆయన చివరి చిత్రం అవ్వడం గమనార్హం.