https://oktelugu.com/

CM Chandhrababu :  చంద్రబాబు అమ్ములపొదిలో మరో పథకం.. మహిళల కోసం సంక్రాంతికి రిలీజ్

ఆది నుంచి మహిళల కోసం ఆలోచించే తత్వం చంద్రబాబుది.మహిళలు అభివృద్ధి చెందితేనే కుటుంబాలు బాగుపడతాయి అన్నది ఆయన వ్యూహం. అందుకే డ్వాక్రా వ్యవస్థను ప్రవేశపెట్టారు. దేశంలోనే ఆదర్శంగా నిలిపారు. ఇప్పుడు వారి కోసం సంక్రాంతికి మరో పథకానికి శ్రీకారం చుట్టనున్నారు చంద్రబాబు.

Written By:
  • Dharma
  • , Updated On : October 3, 2024 / 10:47 AM IST

    CM Chandhrababu

    Follow us on

    CM Chandhrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి నాలుగు నెలలు అవుతోంది.ఒక్కో పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ల మొత్తాన్ని పెంచి అందించింది.గత నాలుగు నెలలుగా విజయవంతంగా అందించగలిగింది.అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టనుంది. డీఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియ పై కసరత్తు జరుగుతుంది. అందుకు సంబంధించి ఫైల్ పై ఎప్పటికీ సీఎం చంద్రబాబు సంతకం చేశారు. మరోవైపు సంక్రాంతికి మరో కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. పి4 పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. డ్వాక్రా సంఘాలు తరహాలో స్వచ్ఛ సేవకుల కోసం ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేసి వారి కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టనున్నారు. అలాగే డ్వాక్రా సంఘాలకు త్వరలో మైక్రోస్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ హోదా కల్పించడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇప్పటికే డ్వాక్రా సంఘాలకు 10 లక్షల రూపాయల రుణాలు ఇస్తున్నారు. వ్యక్తిగత రుణాల పరిమితిని రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచారు. ఇప్పుడు డ్వాక్రా సంఘాల మాదిరిగానే స్వచ్ఛ సేవకుల కోసం ప్రభుత్వం ఆలోచన చేస్తుండడం విశేషం. వాస్తవానికి డ్వాక్రా సంఘాల ఏర్పాటు ఆలోచన చంద్రబాబుదే. 1999లో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. దీంతో మహిళల కోసం స్వయం ఉపాధి పథకాలు పెంచాలని భావించారు. అందులో భాగంగా పురుడు పోసుకున్నది డ్వాక్రా వ్యవస్థ.దేశంలోనే ఆదర్శంగా నిలిచింది వ్యవస్థ. ఏపీ ని చూసి చాలా రాష్ట్రాలు డ్వాక్రా వ్యవస్థను ప్రవేశపెట్టాయి. ఇప్పుడు తాజాగా చంద్రబాబు సర్కార్ స్వచ్ఛ సేవకుల వ్యవస్థను ప్రవేశ పెట్టేందుకు ముందుకు రావడం విశేషం.

    * మహిళా సంక్షేమమే ధ్యేయం
    చంద్రబాబుకి నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. 1995లో తొలిసారిగా సీఎం అయ్యారు చంద్రబాబు. అప్పటినుంచి మహిళల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. మహిళల అభిమానాన్ని చురగొన్నారు. 1999 ఎన్నికల్లో మహిళలు అండగా నిలవడం వల్లే చంద్రబాబు అధికారంలోకి రాగలిగారన్నది విశ్లేషకులు అభిప్రాయం.అయితే 2004,2009 ఎన్నికల్లో మహిళలు ఆదరించకపోవడం వల్లే చంద్రబాబు ఓడిపోయారు. అందుకే చంద్రబాబు మహిళలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడంతో 2014లో తిరిగి అధికారంలోకి వచ్చారు.

    * ఎన్నో పథకాలు వారికోసం
    ఈ ఎన్నికల్లో సైతం మహిళల కోసం అనేక పథకాలు ప్రకటించారు చంద్రబాబు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు అగ్రతాంబూలం ఇచ్చారు.తల్లికి వందనం, మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి పథకాలు అందులో భాగమే. అయితే తాను మహిళా పక్షపాతి అని చాలా సందర్భాల్లో చంద్రబాబు చెప్పుకొచ్చారు. దీనిని ఇప్పుడు నిజం చేసే పనిలో పడ్డారు. అందుకే డ్వాక్రా సంఘాల కుటుంబాల కోసం స్వచ్ఛ సేవకుల వ్యవస్థను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. సంక్రాంతి నుంచి ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుండడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.