https://oktelugu.com/

Game Changer : సంక్రాంతి సినిమాలకు టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్…ఒక్కో టిక్కెట్ రేట్ ఎంతంటే..?

ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే కాకుండా తమ దైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : January 2, 2025 / 01:19 PM IST

    Game Changer review

    Follow us on

    Game Changer : ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే కాకుండా తమ దైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు…ఇక ఏది ఏమైనా మంచి విజయాన్ని సాధించి తమకంటూ సపరేట్ క్రేజ్ ను క్రియేట్ చేసుకున్న వాళ్లు మాత్రమే ఇక్కడ ఇండస్ట్రీలో భారీ అవకాశాలను అందుకుంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో పండగ సీజన్ వచ్చిందంటే చాలు భారీ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతుంటాయి. ఇక అందులో భాగంగానే ఈ సంక్రాంతి సీజన్ ను క్యాష్ చేసుకోవడానికి మూడు పెద్ద సినిమాలు బరిలోకి దిగిపోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే జనవరి 10వ తేదీన రామ్ చరణ్ హీరోగా వస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక దాంతోపాటుగా 12వ తేదీన ‘డాకు మహారాజ్’ పేరుతో బాలయ్య బాబు గర్జించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక జనవరి 14వ తేదీన ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ మూడు సినిమాలు మంచి విజయాలను అందుకోవాలనే ఉద్దేశ్యంతోనే బరిలోకి దిగుతున్నాయి. ఇక ఆయా హీరోల అభిమానులు కూడా వాళ్ళ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇందులో ఎవరి సినిమా విజయాన్ని నమోదు చేసుకుంటుంది. ఎవరి సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుంది అనే విషయాలను తెలుసుకోవడానికి యావత్ ఇండియన్ సినిమా అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    ఇక ఇలాంటి సందర్భంలో ఈ సినిమాలు ఎలాంటి విజయాలను సాధించబోతున్నాయనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది… ఇక ఏది ఏమైనా కూడా భారీ విజయాలను నమోదు చేసుకోవడానికి ప్రస్తుతం ఈ మూడు సినిమాలు బరిలో నిలిచాయి. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున జరిగిన తొక్కేసలాటలో భాగంగా రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మనకు తెలిసిందే.

    ఇక ఆ ఘటన వల్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినిమా టిక్కెట్ల రేటు పెంచుకోవడానికి గాని ప్రీమియర్ షోలకు, బెనిఫిట్ షోలకు గాని ఎలాంటి పర్మిషన్ ఇవ్వడం లేదంటూ తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఒక ఆదేశాన్ని జారీ చేశాడు. మరి ఇప్పుడు తెలంగాణలో ఈ సినిమాల పరిస్థితి ఏంటి అనే ఒక డైలమా అయితే నెలకొంది. ఇక ఇదిలా ఉంటే ఆంధ్రలో మాత్రం అక్కడి గవర్నమెంటు ఈ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తోంది…

    ఇక ప్రీమియర్ షోలకు బెనిఫిట్ షోస్ కి 600 రూపాయల వరకు టిక్కెట్ రేట్లను పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వగా ఒక వారం రోజులపాటు ఈ రేట్లు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది… మరి ఇలాంటి సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది లాస్ట్ మినిట్ లో ఈ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశాలను ఇచ్చే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అనే ధోరణిలో కూడా సినీ పెద్దలు రాజకీయ నాయకులతో కొన్ని మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది…