https://oktelugu.com/

Rajamouli : రేవతి, శ్రీతేజ్ ల వల్లే రాజమౌళి తన సినిమాను రహస్యంగా లాంచ్ చేస్తున్నాడా..? అసలు కారణమేంటి..?

రాజమౌళి పేరు చెబితే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా మంచి రెస్పెక్ట్ అయితే ఉంటుంది. సినిమాలు చూడాలనుకునే ప్రతి ప్రేక్షకుడు మొదట రాజమౌళి సినిమాను చూడడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు...ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా సినిమాను చేస్తున్న విషయం మనకు తెలిసిందే...

Written By:
  • Gopi
  • , Updated On : January 2, 2025 / 01:14 PM IST

    Rajamouli

    Follow us on

    Rajamouli : రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలను జరుపుకుంటుంది. నిజానికి 1300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా లాంచింగ్ ప్రోగ్రాం అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ జక్కన్న మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి చాలా సింపుల్ గా ఈ ఈవెంట్ ను కండక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక దీనికి స్పెషల్ గెస్ట్ లను కూడా ఎవరిని పిలవలేదట. కేవలం సినిమా యూనిట్ మాత్రమే ఇందులో పాల్గొంటున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ నగర శివారులలోని అల్యూమినయం ఫ్యాక్టరీలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుతున్నారు. నిజానికి ఇంత రహస్యంగా సినిమా పూజా కార్యక్రమాలు జరపాల్సిన అవసరం ఏముంది జక్కన్న తలుచుకుంటే రామోజీ ఫిలిం సిటీ లోనే పెద్ద సెట్టు వేసి మరి ఈ ఈవెంట్ జరిపించడానికి ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఇంత చిన్నగా ఈవెంట్ కండక్ట్ చేయడానికి గల కారణం ఏంటి అని ధోరణిలో పలు రకాల ప్రశ్నలైతే వ్యక్తం అవుతున్నాయి… ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రీసెంట్ గా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కేసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఇక దాంతో పాటుగా శ్రీతేజ్ పిల్లవాడు మృత్యువుతో పోరాటం చేస్తున్నాడు. ఇక ఇలాంటి సందర్భాలను చూసిన రాజమౌళి తన సినిమా ఈవెంట్ ను గ్రాండ్ లాంచింగ్ చేస్తే అక్కడికి చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.

    కాబట్టి ఇలాంటి సందర్భంలో వాళ్ళను చూడానికి జనాలు భారీగా రావచ్చు కాబట్టి అక్కడ కూడా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉండచ్చు. ఇక రేవత్ ఘటన జరిగి నెల రోజులు కూడా కానీ సమయాన ఇలాంటి ఒక పెద్ద ఈవెంట్ ను కండక్ట్ చేయడం కంటే చిన్నగా ఈవెంట్ జరుపుకోవడమే ఉత్తమమని ఆలోచించిన రాజమౌళి చాలా సింపుల్ గా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాడు.

    నిజానికి రాజమౌళి అంటేనే చాలా సింప్లిసిటిని ఫాలో అవుతూ ఉంటాడు. కాబట్టి ఈ సినిమా విషయంలో కూడా అలాంటి నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.. మరి ఏది ఏమైనా కూడా ఇలాంటి ఒక డిసిజన్ ని తీసుకున్నందుకు రాజమౌళిని మనం చాలా మెచ్చుకోవాలి.

    ఎందుకంటే రీసెంట్ గా ఈ ఘటన జరిగి నెల రోజులు కానీ సమయంలో మరోసారి అలాంటి ఘటనలు పునరావృతం చేయకూడదనే ఉద్దేశ్యం తోనే ఇలాంటి ఒక సింపుల్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రేక్షకుల గురించి జనాల గురించి ఇంతలా ఆలోచిస్తున్న రాజమౌళి అంటే సగటు ప్రేక్షకులకు సైతం ఇష్టం ఉంటుందనే చెప్పాలి…