Traveling Abroad : ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా విదేశాలకు వెళ్లాలని కలలు కంటారు. ఉన్నత విద్య కోసమైనా, సందర్శన కోసమైనా అక్కడికి వెళ్లాలని కోరుకుంటాము. మీరు కూడా ఎప్పుడైనా విదేశాలకు ప్రయాణం చేయాలనుకుంటే తప్పకుండా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ పర్యాటకం ఇటీవల వేగంగా అభివృద్ధి చెందుతోంది. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, ప్రకృతి అందాలు, అందమైన భవనాలను ఆస్వాదించాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. విశ్రాంతి, వ్యాపారం,ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారు కూడా ఉన్నారు. అయితే, వారందరూ ఎదుర్కొనే సాధారణ సమస్య వీసా. కొన్ని దేశాలకు ఈ ప్రక్రియ సులభం అయినప్పటికీ, ఇతర దేశాలకు వెళ్లడానికి వీసాలు అంత త్వరగా మంజూరు చేయబడవు.
ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం ఇప్పుడు విదేశాలకు ప్రయాణించే భారతీయులపై కూడా నిఘా ఉంచుతుంది. ఇప్పటివరకు, నిఘా వర్గాలు అడ్వాన్స్‌డ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (APIB), అతిథి యాప్ ద్వారా కస్టమ్స్ శాఖ, డీఆర్‌ఐ నిఘా పెట్టేవి. అదే విధంగా భారతీయుల ప్రయాణాల వివరాలను అందించడానికి విమానయాన సంస్థల కోసం ఐటీ విభాగం ఇప్పుడు ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా అభివృద్ధి చేసింది. భారతదేశానికి రాకపోకలు సాగించే దేశీయ, విదేశీ విమానయాన సంస్థలు ఈ సాఫ్ట్‌వేర్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలని సర్క్యులర్లు జారీ చేసింది. ఈ నెల 10 నాటికి పని పూర్తి చేయాలి. అంతేకాకుండా, ఏప్రిల్ 1 నుండి రెండు విదేశీ విమానయాన సంస్థల విషయంలో పైలట్ ప్రాతిపదికన ఈ వ్యవస్థను అమలు చేయనుంది. జూన్ 1 నుండి అన్ని విమానయాన సంస్థలను దాని నిఘాలోకి తీసుకువస్తుంది.
విదేశాలకు ప్రయాణించే భారతీయులలో ఎక్కువ మంది ఆదాయపు పన్ను చెల్లింపుదారులే. అయితే, కొంతమంది ఎగవేతదారులు కూడా విదేశాలకు ప్రయాణిస్తున్నారని ఐటీ శాఖ అనుమానిస్తోంది. ఈ సందర్భంలో విమాన టికెట్‌లోని పీఎన్ఆర్ నంబర్‌పై ఎంత మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు? వారు తమతో బంధువులను తీసుకెళ్తున్నారా? వారు టికెట్ ఎంత కొన్నారో? సామాను బరువు ఎంత? విమానంలో వారు ఏమి తిన్నారు (టీ నుండి వెజ్, నాన్-వెజ్, లిక్కర్ వరకు)? ఇలాంటి వివరాలను కొత్త సంవత్సరంలో నమోదు చేయనున్నారు. ఈ సమాచారాన్ని సేకరించడానికి ఐటీ విభాగం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దేశంలోని అన్ని విమానయాన సంస్థలు దీనిని ఉపయోగించాలని సర్క్యులర్లు జారీ చేసింది. ఫిబ్రవరి 25 నుండి రెండు విదేశీ విమానయాన సంస్థలలో పైలట్ ప్రాతిపదికన ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు సర్క్యులర్ పేర్కొంది. మార్చి 1 నుండి అన్ని విమానయాన సంస్థలకు ఈ విధానం అమలు చేయబడుతుంది.