The Girlfriend Movie First Review: సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతూ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. యంగ్ డైరెక్టర్స్ సైతం వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్స్ గా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే అందాల రాక్షసి సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు రాహుల్ రవీంద్రన్ సైతం దర్శకుడిగా మారిన విషయం మనకు తెలిసిందే. సుశాంత్ హీరోగా వచ్చిన ‘చి.ల.సౌ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఆ సినిమాకి నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత నాగార్జునతో ‘మన్మధుడు 2’ సినిమా చేసి బొక్క బోర్లా పడ్డాడు. ప్రస్తుతం రష్మిక మందానా ను మెయిన్ లీడ్ లో పెట్టి చేసిన ‘గర్ల్ ఫ్రెండ్’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ ని ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది సెలబ్రిటీలకి వేసినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ రివ్యూ బయటికి వచ్చేసింది. సినిమా ఎలా ఉంది అనే విషయం సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది.
Also Read: నెట్ ఫ్లిక్స్ లో ‘ఓజీ’ ని డామినేట్ చేసిన ‘ఇడ్లీ కొట్టు’..ఎన్ని వ్యూస్ వచ్చాయంటే!
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే రష్మిక మందనా తనకు పరిచయం అయిన దీక్షిత్ శెట్టి ని ట్రూ లవ్ చేస్తోంది. అతను మాత్రం ఈమెతో పాటు మరొక అమ్మాయిని కూడా ప్రేమిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో రష్మిక మందాన తన ట్రూ లవ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేసింది. ఇంట్లో తన ఫ్యామిలీ వల్ల తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. తనను ప్రేమించినవాడి నుంచి ఎలాంటి చిక్కులు వచ్చాయి. ఫైనల్ గా ఆ అమ్మాయి ఏం చేసింది అనేదే ఈ సినిమా స్టోరీ…
కథ సింపుల్ గా ఉంది అలాగే ఒకే ప్లాట్ పాయింట్ లో నడుస్తున్నప్పటికి దర్శకుడు స్క్రీన్ మీద చాలా బాగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడట. రాష్మిక లాంటి టాప్ హీరోయిన్ ఉంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ను ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ దర్శకుడు మాత్రం ఎక్కడ కంటెంట్ నుంచి డివియెట్ అయి పక్కకు వెళ్లకుండా బాగా ప్లాన్ చేసుకొని చేశాడు…
ఓవరాల్ గా లేడీస్ పాయింట్ అఫ్ వ్యూలో తీసిన ఈ సినిమా కాలేజ్ అమ్మాయిలకు, పెళ్ళైన మహిళలకు బాగా నచ్చుతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్ ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేసినట్టుగా తెలుస్తోంది…సినిమా మొత్తం ఒక ఎత్తైతే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ స్లో నరేషన్ తో ఉండటం వల్ల సినిమా అక్కడక్కడ ప్రేక్షకుడిని బోర్ కొట్టించడమే కాకుండా చిరాకు తెప్పించేలా ఉందట… ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అద్భుతంగా మలిచినట్టుగా తెలుస్తోంది.
ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో చాలా కేర్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. మ్యూజిక్ విషయంలో కూడా ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది… మొత్తానికైతే రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాతో ఒక డీసెంట్ అటెంప్ట్ ఇచ్చినట్టుగా ఈ సినిమాను చూసిన కొంతమంది సినిమా సెలబ్రిటీలు కొన్ని కామెంట్స్ వ్యక్తం చేస్తున్నారు…