The Girlfriend First Week Collections: రష్మిక(Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్'(The Girlfriend Movie) చిత్రం రీసెంట్ గానే విడుదలై మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఈ ఏడాది ఎలాంటి హంగామా లేకుండా థియేటర్స్ లో విడుదలై సర్ప్రైజ్ హిట్ గా నిల్చిన చిన్న చిత్రాలలో ఒకటిగా నిల్చింది ‘గర్ల్ ఫ్రెండ్’. రీసెంట్ గానే హైదరాబాద్ లో సక్సెస్ ఈవెంట్ ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా విచ్చేయడం, రష్మిక గురించి ఆయన గొప్పగా మాట్లాడడం ఈవెంట్ కి హైలైట్ గా నిల్చింది. నిన్న గాక మొన్న విడుదలైనట్టు అనిపిస్తున్న ఈ చిత్రం అప్పుడే వారం రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. ప్రాంతాలవారీగా ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి మొదటి వారంలో 2 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. సాధారణంగానే ఇలాంటి సినిమాలకు నైజాం ప్రాంతంలో మంచి వసూళ్లు వస్తుంటాయి, ఈ సినిమాకు కూడా అదే విధంగా మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. కేవలం వీకెండ్స్ లో మాత్రమే కాదు,వర్కింగ్ డేస్ లో కూడా ఈ చిత్రం డీసెంట్ స్థాయి వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇక సీడెడ్ లో ఇలాంటి సినిమాలు ఆడడం కష్టమే. అందుకే మొదటి వారంలో కేవలం 62 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది ఈ చిత్రం. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఆరు ప్రాంతాలకు కలిపి ఈ చిరానికి 2 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల 72 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 10 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇక కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి కోటి 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ నుండి ఏకంగా 3 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ వీకెండ్ కి మరో కోటి రూపాయిల షేర్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టే అవకాశాలు ఉన్నాయి. అమెరికన్ డాలర్స్ లెక్క ప్రకారం చూస్తే ఈ వీకెండ్ కి 1 మిలియన్ డాలర్స్ అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం 7 కోట్ల రూపాయలకు మాత్రమే జరిగింది. వరల్డ్ వైడ్ గా 10 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇప్పటి వరకు మూడు కోట్ల రూపాయిల లాభం వచ్చింది అన్నమాట. ఫుల్ రన్ పూర్తి అయ్యేసరికి ఇంకా ఎంత లాభాలను రాబడుతుందో చూడాలి.