https://oktelugu.com/

Vijay Deverakonda Love Proposal: విజయ్ దేవరకొండకి పబ్లిక్ గా అది తీసి పెట్టేసింది.. షాకైన ఛార్మి.. విజయ్ కూడా రెచ్చిపోయాడు.. ఇది నిజంగా షాకింగే!

Vijay Deverakonda Love Proposal: పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ.. విజయ్ ఫ్యాన్స్ లో రోజురోజుకు ఈ సినిమా పై ఆసక్తి రెట్టింపు అవుతుంది. అందుకే, చిత్రబృందం కూడా ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ఈ క్రమంలో ముంబై లో తన లైగర్ ప్రమోషన్స్ ను చేస్తున్నాడు […]

Written By:
  • Shiva
  • , Updated On : August 23, 2022 / 11:32 AM IST
    Follow us on

    Vijay Deverakonda Love Proposal: పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ.. విజయ్ ఫ్యాన్స్ లో రోజురోజుకు ఈ సినిమా పై ఆసక్తి రెట్టింపు అవుతుంది. అందుకే, చిత్రబృందం కూడా ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ఈ క్రమంలో ముంబై లో తన లైగర్ ప్రమోషన్స్ ను చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ క్రమంలో ఓ మాల్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ విజయ్ ను చూడగానే తేజు అనే యువతి తెగ సంబరపడిపోయింది.

    Vijay Deverakonda

    నేరుగా విజయ్ దగ్గరకు వెళ్ళింది. ఆమె చూపులు చూసి విజయ్ దేవరకొండ ఒక్క క్షణం పాటు అలాగే ఆమె వైపే చూసాడు. ఆమె చూపులో అంత ప్రేమ ఉంది. వెంటనే ఆ అమ్మాయి ఏం ఆలోచించకుండా విజయ్ ను హాగ్ చేసుకుంది. విజయ్ కూడా ఆ యువతిని దగ్గరకు తీసుకుని ప్రేమగా నిమిరాడు. అంతలో ఆ యువతి బ్యాగ్ లో నుంచి సడెన్ గా ఏదో తీసింది. అది చూసి విజయ్ షాక్ అయ్యాడు. పక్కన ఉన్న ఛార్మి కూడా షాక్ అయ్యింది.

    Also Read: Karthika Deepam Vantalakka Re Entry: వంటలక్క ఏడ్చింది.. ‘కార్తీక దీపం’ పంట పండింది!

    అది గోల్డ్ రింగ్. ఆ రింగ్ విజయ్ చేతికి తొడిగి, ఆ అమ్మాయి తన లవ్ ను ఎక్స్‌ప్రెస్ చేసింది. దాంతో ఈ రింగ్ ను చూస్తూ విజయ్ అదిరిపోయే మాట ఇచ్చాడు. లైగర్ సినిమా ప్రమోషన్స్ పూర్తయ్యే వరకు ఆ రింగ్‌ను తన చేతికి అలానే ఉంచుకుంటానని ఆ అమ్మాయికి విజయ్ దేవరకొండ మాట ఇచ్చాడు. దాంతో ఆ అమ్మాయి ఇంకా సంబరపడి పోయింది.

    Vijay Deverakonda

    మొత్తానికి విజయ్ దేవరకొండతో ఆ అమ్మాయి ప్రేమ ఇష్యూ ప్రస్తుతం సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తోంది. ఇక లైగర్ సినిమా పాన్ ఇండియా సినిమా. అన్నీ సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా లైగర్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన కరుణ్ జోహార్ ఈ చిత్రాన్ని హిందీలో ఓన్ గా రిలీజ్ చేస్తున్నాడు. మిగిలిన అన్ని దక్షిణాది రాష్ట్రాలలో వరంగల్ శ్రీను రిలీజ్ చేయబోతున్నాడు.

    ఈ క్రమంలో వరంగల్ శ్రీను షాకింగ్ రేట్ కి లైగర్ దక్షిణాది రాష్ట్రాల థియేటర్ రైట్స్ కొనుక్కున్నాడు. ఇంతకీ ఆ రేట్ ఎంత అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా ?. ఏకంగా 70 కోట్లకు లైగర్ రైట్స్ కొన్నాడు వరంగల్ శ్రీను. చివరగా ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పుకోవాలి. స్టార్ హీరోల రేంజ్ లో విజయ్ దేవరకొండ తన లైగర్ బిజినెస్ తో సరికొత్త రికార్డులు నమోదు చేశాడు.

    Also Read:Liger First Review: “లైగర్” ఫస్ట్ డిటైల్డ్ రివ్యూ..!

     

     

    Tags