https://oktelugu.com/

Karthika Deepam Vantalakka Re Entry: వంటలక్క ఏడ్చింది.. ‘కార్తీక దీపం’ పంట పండింది!

Karthika Deepam Vantalakka Re Entry: వంటలక్క.. ఈమె కోసం తెలుగునాట ఎన్ని యుద్ధాలు జరిగాయో అందరికీ తెలిసిందే. డాక్టర్ బాబుతో వంటలక్క కలవాలని తెలుగునాట అభిమాన సంఘాలన్నీ సోషల్ మీడియాను హోరెత్తించాయి. వీళ్లదరి కలయిక చూసి చచ్చిపోవాలని ఉందని కొందరు మహిళా ఫ్యాన్స్ ఏడ్చేశారు. ఎలాగైతే ఏమి ఆ మధ్యన వంటలక్క-డాక్టర్ బాబు కలిశారు. మోనిత ఆట కట్టైంది. అయితే కలవడంతోనే విహార యాత్రకు వెళ్లి వారిద్దరూ చనిపోతారు. అంతలా పాపులర్ అయిన ఈ సీరియల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 23, 2022 / 11:20 AM IST
    Follow us on

    Karthika Deepam Vantalakka Re Entry: వంటలక్క.. ఈమె కోసం తెలుగునాట ఎన్ని యుద్ధాలు జరిగాయో అందరికీ తెలిసిందే. డాక్టర్ బాబుతో వంటలక్క కలవాలని తెలుగునాట అభిమాన సంఘాలన్నీ సోషల్ మీడియాను హోరెత్తించాయి. వీళ్లదరి కలయిక చూసి చచ్చిపోవాలని ఉందని కొందరు మహిళా ఫ్యాన్స్ ఏడ్చేశారు. ఎలాగైతే ఏమి ఆ మధ్యన వంటలక్క-డాక్టర్ బాబు కలిశారు. మోనిత ఆట కట్టైంది. అయితే కలవడంతోనే విహార యాత్రకు వెళ్లి వారిద్దరూ చనిపోతారు. అంతలా పాపులర్ అయిన ఈ సీరియల్ లో కొద్దిరోజులుగా వంటలక్క లేని లోటు బాగా కనిపించింది.

    Karthika Deepam Vantalakka

    వంటలక్క-డాక్టర్ బాబు ఎపిసోడ్ జనాలకు బోరు కొట్టిందని.. వాళ్లను చంపేసి వారి వారసులతో కథ చెప్పడం ప్రారంభించాడు దర్శకుడు రాజేంద్ర. కానీ ఇక్కడే గతి తప్పింది. నవతరం ప్రేమలకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదు. తెలుగులోనే టాప్ రేటింగ్ తీసుకొచ్చిన ‘కార్తీకదీపం’ సీరియల్ వంటలక్క-డాక్టర్ బాబు మరణంతో కుదేలైంది. రేటింగ్ పడిపోయింది. జనాలు చూడడం మానేశారు.

    Also Read: Liger First Review: “లైగర్” ఫస్ట్ డిటైల్డ్ రివ్యూ..!

    స్టార్ మా టీవీకి ‘కార్తీక దీపం’ సీరియల్ టాప్ రేటింగ్ తీసుకొచ్చేది. అలాంటి సీరియల్ ఇప్పుడు వంటలక్క లేకపోవడంతో పడిపోయింది. కొత్త వారితో వర్కవుట్ కాదని తేల్చిన దర్శకుడు మళ్లీ చనిపోయిన వంటలక్కను, డాక్టర్ బాబును బతికించాడు. కానీ డాక్టర్ బాబు మతి తప్పేలా చేశాడు. డాక్టర్ బాబును విలన్ మోనిత తీసుకొని వెళ్లి అతడితో ఉండేలా ప్లాన్ చేశాడు.

    Karthika Deepam Vantalakka

    ఇక కారు ప్రమాదం నుంచి కోలుకున్న వంటలక్క భర్త కోసం ఒక్క ఏడుపు ఏడవగానే స్టార్ మా టీవీ చానెల్ రేటింగ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇది కదా ప్రేక్షకులకు కావాల్సింది అని మళ్లీ వంటలక్క, డాక్టర్ బాబు, మోనితలను తెరపైకి తెచ్చారు. ఈ ముగ్గురి మధ్యన డ్రామా మొదలుపెట్టారు. భర్త కోసం వంటలక్క ఏడుపు చూసి జనాలు మళ్లీ ఏడ్వడం మొదలుపెట్టారు.ఇ ప్పుడీ సీరియల్ కు మళ్లీ జనాదరణ పెరిగిపోయింది. దీప కనపడడంతోనే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతున్నారు. దీప కన్నీళ్లకు కరిగిపోతున్నారు.
    ఇన్నాళ్లు వంటలక్క లేని లోటు సీరియల్ లో స్పష్టంగా కనిపించింది. ఇప్పుడది పూర్తికావడంతో జనాలు మళ్లీ సీరియల్ కు కనెక్ట్ అవుతున్నారు. టాప్ రేటింగ్ కు తీసుకెళుతున్నారు. ఎంతైనా వంటలక్క లేని లోటు మాత్రం బుల్లితెరపై పూడ్చలేనిది అని తేటతెల్లమైంది. ఆమె రాకతో బుల్లితెరకు నిండుదనం వచ్చేసింది.

    Also Read:Hero Nikhil: ఎందరో స్టార్ హీరోల వల్ల కాలేదు… కానీ నిఖిల్ చేసి చూపించాడు

     

     

     

    Tags