HomeActorsAllu Arjun Pushpa 2: పుష్ప 2 పూజ కార్యక్రమం కి అల్లు అర్జున్ డుమ్మా...

Allu Arjun Pushpa 2: పుష్ప 2 పూజ కార్యక్రమం కి అల్లు అర్జున్ డుమ్మా కొట్టడానికి కారణం అదేనా?

Allu Arjun Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ని పుష్ప కి ముందు, పుష్ప కి తర్వాత అని విభజించడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..అప్పటి వరుకు టాలీవుడ్ టాప్ 5 హీరోలలో ఒకడిగా నిలిచినా అల్లు అర్జున్ ఫేట్ ని పాన్ ఇండియన్ లెవెల్ లో మార్చేసిన సినిమా ఇది..ఇప్పుడు అల్లు అర్జున్ అంటే పాన్ ఇండియన్ లెవెల్ లో ఒక పేరు కాదు..బ్రాండ్..ఆయన ఏమి చేసిన సెన్సషనల్ గా మారిపోతుంది..ముఖ్యంగా పుష్ప లో ఆయన చేసిన ‘తగ్గేదేలే’ మ్యానరిజం ఎంతలా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Allu Arjun Pushpa 2
Allu Arjun Pushpa 2

Also Read: Vijay Deverakonda Love Proposal: విజయ్ దేవరకొండకి పబ్లిక్ గా అది తీసి పెట్టేసింది.. షాకైన ఛార్మి.. విజయ్ కూడా రెచ్చిపోయాడు.. ఇది నిజంగా షాకింగే!

అంతర్జాతీయ స్థాయిలో ఒక సెలబ్రేషన్ థీమ్ లాగ మారిపోయింది ఆ మ్యానరిజం..పుష్ప క్యారక్టర్ జనాలకు అంతలాగ ఎక్కింది అన్నమాట..అలాంటి సెన్సషనల్ హిట్ గా నిలిచినా సినిమాకి సీక్వెల్ అంటే ఇక ఏ రేంజ్ లో ఉండాలో అర్థం ఊహించుకోవచ్చు..ఇన్ని రోజులు అల్లు అర్జున్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన పుష్ప 2 సినిమా ఈరోజు హైదరాబాద్ లో పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయ్యింది. ఈ పూజ కార్యక్రమం లో ఒక్క అల్లు అర్జున్ మినహా మూవీ యూనిట్ మొత్తం పాల్గొన్నది.

Allu Arjun
Allu Arjun

Also Read: Karthika Deepam Vantalakka Re Entry: వంటలక్క ఏడ్చింది.. ‘కార్తీక దీపం’ పంట పండింది!

ప్రస్తుతం అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డి తో విదేశీ పర్యటన లో బిజీ గా ఉండడం వల్ల ఈ చిత్రం ప్రారంబోత్సవానికి హాజరు కాలేకపోయినట్టు సమాచారం..మరోపక్క ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక కూడా ఈ ప్రారంభోత్సవానికి రాలేదు..ఈరోజు ఆమెకి తమిళం లో విజయ్ సినిమా షూటింగ్ ఉండడం వల్ల ఆమె రాలేకపోయింది. పుష్ప సినిమా ఎవ్వరు ఊహించని విధంగా భారీ సెన్సషనల్ హిట్ అవ్వడం తో పార్ట్ 2 పై బాహుబలి మరియు KGF సీక్వెల్స్ ని మించిన క్రేజ్ ఏర్పడిపోయింది..దీనితో సుకుమార్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పై చాలా బలంగా కూర్చున్నాడు..పార్ట్ 1 తో పోలిస్తే పార్ట్ 2 కథ మరియు కథనం పరంగా అనేక మలుపులతో తీర్చి దిద్దారట.

Allu Arjun
Allu Arjun

Also Read: Liger First Review: “లైగర్” ఫస్ట్ డిటైల్డ్ రివ్యూ..!

ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..తమిళ హీరో విజయ్ సేతుపతి కూడా ఈ చిత్రం లో ఒక ముఖ్య పాత్ర పోషించే అవకాశం ఉందని తెలుస్తుంది..ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల రెండవ వారం నుండి ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది.

YouTube video player
YouTube video player
YouTube video player

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version