The Ghost Collections: ‘ది ఘోస్ట్’ మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎక్సక్లూసివ్ గా మీకోసం

The Ghost Collections:  యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘ది ఘోస్ట్’ మూవీ నిన్న దసరా కానుకగా విడుదలైన సంగతి మన అందరికి తెలిసిందే..మొదటి రోజు మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాకి ఓపెనింగ్స్ కూడా అతి దారుణంగా వచ్చాయి..నాగార్జున గారి సినిమాకి అసలు ఓపెనింగ్స్ రావడం ఎప్పుడో ఆగిపోయాయి..ఒక బంగార్రాజు సినిమా మినహా ఆయన చేసిన సినిమాలు ఈమధ్య కాలం లో పది కోట్ల […]

Written By: Neelambaram, Updated On : October 6, 2022 3:29 pm
Follow us on

The Ghost Collections:  యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘ది ఘోస్ట్’ మూవీ నిన్న దసరా కానుకగా విడుదలైన సంగతి మన అందరికి తెలిసిందే..మొదటి రోజు మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాకి ఓపెనింగ్స్ కూడా అతి దారుణంగా వచ్చాయి..నాగార్జున గారి సినిమాకి అసలు ఓపెనింగ్స్ రావడం ఎప్పుడో ఆగిపోయాయి..ఒక బంగార్రాజు సినిమా మినహా ఆయన చేసిన సినిమాలు ఈమధ్య కాలం లో పది కోట్ల రూపాయిల లోపే క్లోసింగ్ కలెక్షన్స్ పడేవి..ఇక మొదటి రోజు ఓపెనింగ్స్ సంగతి సరేసరి..కానీ నిన్న విజయ దశమి కానుకగా విడుదల అయ్యింది కాబట్టి పండగ హాలిడే ని సద్వినియోగ పరుచుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేసింది..కానీ పండగ రోజు కూడా ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు చిల్లరే అవ్వడం విశేషం..ఈ ఓపెనింగ్స్ చూస్తే నాగార్జున గారు ఇక సినిమాలు మానేయడం బెస్ట్ అనిపిస్తాది..అంత దరిద్రంగా వసూళ్లు వచ్చాయి..ఒక్కసారి ప్రాంతాల వారీగా ఈ సినిమాకి ఎంత వసూళ్లు వచ్చాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం.

nagarjuna

ప్రాంతం షేర్ కలెక్షన్స్
నైజం 50 లక్షలు
సీడెడ్ 15 లక్షలు
ఉత్తరాంధ్ర 23 లక్షలు
ఈస్ట్ 9 లక్షలు
వెస్ట్ 6 లక్షలు
నెల్లూరు 4 లక్షలు
గుంటూరు 22 లక్షలు
కృష్ణ 16 లక్షలు
మొత్తం 1.45 కోట్లు
ఓవర్సీస్ +
రెస్ట్ ఆఫ్ ఇండియా – 20 లక్షలు

Also Read: Godfather vs Ghost: చిరు వర్సెస్ నాగ్… మధ్యలో నేన్నానంటూ డెబ్యూ హీరో… దసరా బరిలో విన్నర్ ఎవరు?

మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అన్ని ప్రాంతాలకు కలిపి కోటి 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది..ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 22 కోట్ల రూపాయలకు జరిగింది..ప్రవీణ్ సత్తారు డైరెక్టర్ కావడం..దానికి తోడు ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం తో ఇంత మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది..కానీ ఇప్పుడు వచ్చిన ఓపెనింగ్స్ ని బట్టి చూస్తుంటే ఈ సినిమా ట్రిపుల్ డిజాస్టర్ ఫ్లాప్ కన్ఫర్మ్ లాగ ఉంది..రెండవ రోజు కలెక్షన్స్ అయితే అతి దారుణంగా ఉన్నాయి..చాలా ప్రాంతాలలలో ఈ సినిమాకి షేర్స్ వచ్చే సూచనలు కూడా కనిపించడం లేదు.

nagarjuna

నాగార్జున కెరీర్ లో మరో సింగిల్ డిజిట్ షేర్ క్లోసింగ్ సినిమాగా ది ఘోస్ట్ కూడా నిలిచిపోతుంది..ఇది చూసిన తర్వాత నాగార్జున గారు సినిమాలు ఆపేయడం మంచిదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..సినిమాల మీద మక్కువ పోకపోతే కనీసం నిర్మాతగా అయినా కొనసాగమని..లేదా క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ వేసుకోమని చెప్తున్నారు.

Also Read:Megastar Chiranjeevi Godfather: చిరు గాడ్ ఫాదర్ మూవీకి టాలీవుడ్ సెలబ్స్ షాకింగ్ రివ్యూస్… ఎవరేమన్నారంటే!

Tags