Game Changer and Daku Maharaj : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటివరకు వాళ్లు సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇక మీదట వాళ్ళు చేస్తున్న సినిమాలతో భారీ విజయాలను సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు సాగుతూ ఉండటం మంచి విషయమనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం సంక్రాంతి కానుక గా ‘రామ్ చరణ్’ గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేక పోయిందనేది వాస్తవం…ఇక ఈ సినిమా సగటు ప్రేక్షకులను మెప్పించడంలో చాలా వరకు ఫెయిల్ అయింది. మరి అలాంటి సందర్భంలోనే ఈ సినిమాకి భారీ స్పందననైతే లభించడం లేదనే చెప్పాలి. ఇక ఫ్యాన్స్ ఈ సినిమాని ఒకటికి రెండుసార్లు చూస్తున్నప్పటికి సాధారణ ప్రేక్షకులకు మాత్రమే సినిమా అంత పెద్దగా మ్యాజిక్ అయితే క్రియేట్ చేయలేకపోయింది. ఈ సినిమా తర్వాత సంక్రాంతి కానుకగా వచ్చిన మరొక సినిమా ‘డాకు మహారాజ్’…బాలయ్య బాబు హీరోగా వచ్చిన ఈ సినిమా యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. నిజానికి ఈ సినిమాతో భారీ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నా బాలయ్య బాబు కి ఎట్టకేలకు సూపర్ సక్సెస్ అయితే దక్కింది. ఇక ఈ మూవీ తో వరుసగా నాల్గవ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు… మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా అందించిన విజయం అనేది నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి.
బాలయ్య బాబీ కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే మొదటి నుంచి కూడా కమర్షియల్ యాంగిల్ లో సినిమా ఉండబోతుందంటూ అందరూ అంచనా వేస్తూ వచ్చారు. కానీ వాళ్ళ ఊహలకు అందని విధంగా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడం ఇప్పుడు అభిమానులతో పాటు యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరికి ఆనందాన్ని కలిగిస్తుందనే చెప్పాలి.
మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా బెస్ట్ గా నిలిచింది అంటూ కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం డాకు మహారాజ్ కి భారీ విజయం సాధించడానికి ఎక్కువ స్కోప్ అయితే ఉంది. గేమ్ చెంజర్ సినిమాతో పోలిస్తే డాకు మహారాజ్ సినిమా కమర్షియల్ గా సక్సెస్ ని సాధించడమే కాకుండా కలెక్షన్ల రూపంలో కూడా భారీ వసూళ్లను రాబడుతూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…
మరి ఏది ఏమైనా బాబీ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో చిరంజీవికి భారీ సక్సెస్ ని అందించాడు. ఇప్పుడు బాలయ్య బాబుకి కూడా మంచి విజయాన్ని అందించి కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకొని ఈ సంక్రాంతి విన్నర్ గా నిలిచాడనే చెప్పాలి…