Rajamouli Kamal Haasan Combination: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన దర్శకుడు రాజమౌళి… ఈయన ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. మహేష్ బాబుతో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు… రాజమౌళితో సినిమా చేయడానికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హీరో ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం… ఇక ప్రస్తుతం రాజమౌళి ని టచ్ చేసే దర్శకుడు లేడు. కాబట్టి అతను నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఇక అతనితో సినిమా చేస్తే భారీ సక్సెస్ వస్తుందని ప్రతి ఒక్క హీరో కూడా భావిస్తున్నాడు. అందుకే అతనితో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. కానీ రాజమౌళి మాత్రం సెలెక్టెడ్ గా సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
ముఖ్యంగా మన తెలుగు హీరోలతోనే సినిమాలు చేసుకుంటూ ఆయన మనవాళ్లను మాత్రమే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు…రాజమౌళి గతంలో కమల్ హాసన్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేశాడు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. 2005వ సంవత్సరంలో కమల్ హాసన్ కి తగ్గట్టుగా ఒక డిఫరెంట్ స్టోరీ రెడీ చేయించారట.
అందులో డ్యాన్స్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కి కూడా విపరీతమైన స్కోప్ ఉండడంతో దానికి కమల్ హాసన్ అయితే బాగుంటుందని అటు తమిళ్, ఇటు తెలుగు రెండు భాషల్లో వర్కౌట్ అవుతుందనే ఉద్దేశ్యంతో రాజమౌళి ఆ సినిమాను కమల్ హాసన్ తో ప్లాన్ చేశాడట. కానీ కమల్ హాసన్ మాత్రం రాజమౌళితో సినిమాని రిజెక్ట్ చేసినట్టుగా అప్పట్లో వార్తలైతే వచ్చాయి.
కారణం ఏంటంటే కమల్ హాసన్ అప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల తన డేట్స్ లేకపోవడంతో ఒక సంవత్సరం పాటు రాజమౌళిని వెయిట్ చేయమని చెప్పాడు. దాంతో రాజమౌళి ఆ స్క్రిప్ట్ పక్కన పెట్టి ఇంకో సినిమా మీద వర్క్ చేశాడు. మొత్తానికైతే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా మిస్ అయింది. ఒకవేళ అప్పట్లో వీళ్ళిద్దరి కాంబినేషన్ సెట్ అయి ఉంటే ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసేదని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…