https://oktelugu.com/

Pawan Kalyan: సమంత విషయంలో స్పందించిన సినీ పరిశ్రమ,పవన్ కళ్యాణ్ కూతురుపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు?

పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ ని, అతని ఇంట్లో వాళ్ళని, చిన్న పిల్లల్ని కూడా వదలకుండా అడ్డమైన బూతులు తిట్టాడు కదా, అప్పుడు వీళ్లంతా ఎక్కడ ఉన్నారు?, ఇప్పుడు చూపిస్తున్న ధైర్యం, తెగువ అప్పుడు ఎందుకు చూపించలేకపోయారు?,మంత్రి స్థాయి వ్యక్తినే నిలదీసిన సినీ ఇండస్ట్రీ, కేవలం ఒక వైసీపీ కార్యకర్తగా ఉన్నటువంటి పోసాని కృష్ణ మురళి ని ఎందుకు నిలదీయలేదు?..పోసాని కృష్ణ మురళి అదే ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ కూతురు అత్యాచారానికి గురి అవ్వాలి అని శపిస్తాడు.

Written By:
  • Vicky
  • , Updated On : October 3, 2024 / 02:07 PM IST

    Pawan Kalyan(19)

    Follow us on

    Pawan Kalyan: మంత్రి కొండా సురేఖ సమంత పై, అలాగే అక్కినేని కుటుంబం పై చేసిన తీవ్రమైన వ్యాఖ్యలకు సినీ ఇండస్ట్రీ మొత్తం రెస్పాన్స్ ఇచ్చింది. ప్రభుత్వ అధికారి అయినప్పటికీ కూడా ఏమాత్రం భయపడకుండా ప్రతీ ఒక్కరు ఆమె మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు. ఒకపక్క హైడ్రా పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖుల ఇళ్లను కూల్చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా భయపడకుండా ఇండస్ట్రీ మొత్తం స్పందించిన తీరు నిజంగా హర్షణీయం. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, నాని, మంచు మనోజ్, మంచు విష్ణు, హీరోయిన్ సంయుక్త మీనన్, రామ్ గోపాల్ వర్మ ఇలా అందరూ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. తన వ్యాఖ్యలపై ఏర్పడిన తీవ్రమైన వ్యతిరేకతకు కొండా సురేఖ కూడా స్పందించి క్షమాపణలు చెప్పింది, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టుగా మీడియా ముఖంగా తెలిపింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. తెలుగు పరిశ్రమకి చెందిన నటీ నటుల ధైర్యాన్ని మెచ్చుకోవలసిందే.

    కానీ ఈ ధైర్యమంతా పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ ని, అతని ఇంట్లో వాళ్ళని, చిన్న పిల్లల్ని కూడా వదలకుండా అడ్డమైన బూతులు తిట్టాడు కదా, అప్పుడు వీళ్లంతా ఎక్కడ ఉన్నారు?, ఇప్పుడు చూపిస్తున్న ధైర్యం, తెగువ అప్పుడు ఎందుకు చూపించలేకపోయారు?,మంత్రి స్థాయి వ్యక్తినే నిలదీసిన సినీ ఇండస్ట్రీ, కేవలం ఒక వైసీపీ కార్యకర్తగా ఉన్నటువంటి పోసాని కృష్ణ మురళి ని ఎందుకు నిలదీయలేదు?..పోసాని కృష్ణ మురళి అదే ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ కూతురు అత్యాచారానికి గురి అవ్వాలి అని శపిస్తాడు..అభం శుభం తెలియని ఆ చిన్నారి తల్లి ఏమి చేసింది?, ఇలా మాట్లాడడానికి సిగ్గు అనిపించలేదా?, అసలు మనిషివేనా? అని ఎందుకు ఇండస్ట్రీ పెద్దలు నిలదీయలేదు?..ఇతర హీరోల సంగతి పక్కన పెడితే మెగా ఫ్యామిలీ హీరోలు కూడా స్పందించకపోవడం గమనార్హం.

    దీని అర్థం ఏమిటి?, సీఎం రేవంత్ రెడ్డి అంటే ఇండస్ట్రీ లో ఎవరికీ భయం లేదు, జగన్ మోహన్ రెడ్డి అంటే భయం అని జనాలు అనుకోవాలా?..సౌత్ ఇండియా లో ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్, కోట్ల మందిని ప్రభావితం చేయగల రాజకీయ నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ పై ఇలాంటి మాటల దాడులు ఎన్నో జరిగాయి, కానీ ఒక్కరు కూడా స్పందించలేదు..ఎందుకని?, అసలు మెగా ఫ్యామిలీ హీరోలకు అయినా పవన్ కళ్యాణ్ సక్సెస్ ని ఎంజాయ్ చేసేందుకు అర్హత ఉందా?, కష్టాల్లో ఉన్నప్పుడు తమ గొంతుకని వినిపించలేదు, కానీ ఆంధ్ర ప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన్ని ఇంటికి పిలిపించుకొని, కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. దీనిని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలా తీసుకోవాలి?..ఇండస్ట్రీ ని మాజీ సీఎం జగన్ అప్పటికే తొక్కేసి ఉన్నాడు, మళ్ళీ పవన్ కళ్యాణ్ కి సపోర్టుగా మాట్లాడితే ఇంకా ఎక్కడ తొక్కుతాడో అనే భయంతోనే ఇండస్ట్రీ నుండి ఎవ్వరూ స్పందించలేదు అనుకోవాలా? అనేది ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున సాగుతున్న చర్చ.