https://oktelugu.com/

Pallavi Prashanth : ‘రైతు బిడ్డ’ కాస్త ‘ఆట బిడ్డ’ అయ్యాడు..ఏడాది కాలంలో ఇంత మార్పా..? పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం ఏమి చేస్తున్నాడంటే!

గత సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి రైతు బిడ్డగా అడుగుపెట్టి, టైటిల్ విన్నర్ గా నిలిచి సెన్సేషన్ సృష్టించిన పల్లవి ప్రశాంత్ ని మన తెలుగు ఆడియన్స్ అంత తేలికగా మర్చిపోలేరు.

Written By:
  • Vicky
  • , Updated On : December 20, 2024 / 03:52 PM IST

    Pallavi Prashanth

    Follow us on

    Pallavi Prashanth : గత సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి రైతు బిడ్డగా అడుగుపెట్టి, టైటిల్ విన్నర్ గా నిలిచి సెన్సేషన్ సృష్టించిన పల్లవి ప్రశాంత్ ని మన తెలుగు ఆడియన్స్ అంత తేలికగా మర్చిపోలేరు. సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించిన ఈయన, బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనడం తన కల అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వీడియోస్ చేసేవాడు. ఒక్క అవకాశం కోసం అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ ఆయన తిరగని రోజంటూ లేదు. అయితే పల్లవి ప్రశాంత్ అప్పట్లో చేసిన వీడియోలను చూసి నెటిజెన్స్ ఒక రేంజ్ లో ట్రోల్ చేసేవారు. ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అని తిట్టేవాళ్ళు. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన కొత్తల్లో కూడా ఈయనకి చాలా నెగటివిటీ ఉండేది. కెమెరాల ముందు కావాలని పెర్ఫార్మన్స్ చేస్తున్నాడని అనుకునేవాళ్లు నెటిజెన్స్. కానీ ఎప్పుడైతే రతికా తో లవ్ ట్రాక్ ని పక్కన పెట్టాడో, అప్పటి నుండి ప్రశాంత్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.

    ముఖ్యంగా టాస్కుల్లో ఈయనతో తలపడాలంటే ఎవ్వరైనా భయపడేవారు. పులిలా ఆడి, తనపై ఉన్న నెగటివిటీ ని మొత్తం పాజిటివ్ గా మార్చుకున్నాడు. అందుకు శివాజీ సహాయ సహకారాలు కూడా చాలా ఉన్నాయనుకోండి అది వేరే విషయం. కానీ హౌస్ లో మనమంతా చూసిన పల్లవి ప్రశాంత్ కి, బయట ఇప్పుడు మనం చూస్తున్న పల్లవి ప్రశాంత్ కి చాలా తేడాలు గమనించారు ప్రేక్షకులు. హౌస్ లో ఉన్నన్ని రోజులు తనపై అవతల కంటెస్టెంట్స్ ఎంతలా నోరు పారేసుకున్నా వినయంగా, వినమ్రతతో మాట్లాడిన గుణమే జనాలకు నచ్చింది. కానీ బయటకి వచ్చిన తర్వాత ఆ యాంగిల్ ప్రశాంత్ లో కనపడలేదు. ఏ మీడియా వల్ల అయితే ఆయన ఇంత దూరం వచ్చాడో, ఆ మీడియా కి ఇంటర్వ్యూస్ ఇచ్చేందుకు నిరాకరించి చాలా పొగరు చూపించాడు. అంతే కాదు గెలిచిన తర్వాత ప్రైజ్ మనీ ని రైతుల కోసం ఖర్చు చేస్తా అన్నాడు.

    కానీ బయటకి వచ్చిన తర్వాత మాట మార్చాడు. ఆ గెలిచిన డబ్బు మొత్తాన్ని ఏమి చేసాడు అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆయన తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో తన లేటెస్ట్ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేసాడు. శరీరం మొత్తం మత్తు ఏసుకొని, పొలంలో దూకి పనులు చేసుకునేవాడిలాగా ఇన్ని రోజులు ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేసిన పల్లవి ప్రశాంత్, ఇప్పుడు ఇలా రాయల్ స్టైలిష్ లుక్ లో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ బిల్డప్స్ కి ఏమి తక్కువ లేదు, ముందు హౌస్ లో ఉన్నప్పుడు నువ్విచ్చిన మాటని ఏమి చేసావో చెప్పు అంటూ ఈ ఫోటోల క్రింద నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.