https://oktelugu.com/

Samantha : అభిమానులను వెర్రోళ్ళని చేసిన సమంత..బయట చేసింది మొత్తం డ్రామానా..? నోరు జారేసిందిగా!

ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రెండు మూడు సినెమాలతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగి, ఆ తర్వాత తమిళం, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేసి, దశాబ్దకాలం లోనే పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ స్టార్ స్టేటస్ ని అందుకున్న నటి సమంత.

Written By:
  • Vicky
  • , Updated On : December 20, 2024 / 03:19 PM IST

    Samantha

    Follow us on

    Samantha : ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రెండు మూడు సినెమాలతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగి, ఆ తర్వాత తమిళం, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేసి, దశాబ్దకాలం లోనే పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ స్టార్ స్టేటస్ ని అందుకున్న నటి సమంత. ఈమె ఒక సినిమాలో ఉందంటే, కచ్చితంగా ఆ సినిమాలో ఎదో విశేషం ఉంటుంది అనే బ్రాండ్ ఇమేజ్ ని ఈమె సొంతం చేసుకుంది. నాగ చైతన్య తో పెళ్లి కి ముందు ఆమెకి ఇలాంటి ఇమేజ్ ఉండేది కాదు. కేవలం స్టార్ హీరోయిన్ ఇమేజ్ మాత్రమే ఉండేది. కానీ అతనితో పెళ్లి తర్వాత ఈమె రెగ్యులర్ హీరోయిన్స్ రోల్స్ కి చిన్నగా దూరం అవుతూ, కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే పోషిస్తూ వచ్చింది. ఆ సమయంలోనే ఈమెకంటూ ఒక ఇమేజ్ ఏర్పడింది. ఇదంతా పక్కన పెడితే నాగ చైతన్య తో విడాకులు తర్వాత సమంత జీవితంలో చోటు చేసుకున్న అలజడి మనమంతా కళ్లారా చూసాము.

    విడాకులు తర్వాత ఆమెకి ఒత్తిడి ఎక్కువ అవ్వడంతో మయోసిటిస్ వ్యాధికి గురైంది. ఈ వ్యాధి ప్రాణాంతకమైనది అని, ఆమె తన ప్రాణాలను దక్కించుకోవడానికి ఒక యుద్ధమే చేసిందని ఆమె అభిమానులు, సన్నిహితులు తరచూ అంటూ ఉంటారు. అదంతా పక్కన పెడితే విడాకుల తర్వాత ఈమె పాల్గొన్న అనేక ఇంటర్వ్యూస్ లో, ఎదో ఒక సందర్భంలో కన్నీళ్లు పెట్టుకునేది. జీవితంలో ఆమె ఎదురుకున్న కష్టాలన్నీ గుర్తుకు రావడంతో, ఆ ప్రస్తావన యాంకర్లు తీసుకొచ్చినప్పుడల్లా సమంత ఏడ్చేస్తుందని అభిమానులు అనుకునేవారు. ఆమెపై జాలి చూపిస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తుండేవారు. కానీ అలా జాలి చూపించిన ప్రతీ ఒక్కరికి సమంత ఫ్యూజులు ఎగిరిపోయే రేంజ్ ట్విస్ట్ ఈమధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఇచ్చింది. ఇంతకు ఆమె ఏమి మాట్లాడిందో ఒకసారి చూద్దాం.

    ఆమె మాట్లాడుతూ ‘చాలా మంది నేను ఇంటర్వ్యూస్ లో, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కన్నీళ్లు పెట్టుకోవడాన్ని చూసి, నేను చాలా సెన్సిటివ్, ప్రతీ దానికి ఏడ్చేస్తాను అని అనుకుంటూ ఉంటారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. నాకు లైట్ సెన్సిటివిటీ ఉంది. ఎప్పుడైనా లైట్ నా కళ్ళలో పడినప్పుడు నాకు తెలియకుండానే నీళ్లు వచ్చేస్తాయి. అంతకు మించి అభిమానులు ఊహించుకుంటున్నట్టు నేను ఏడవట్లేదు’ అని చెప్పుకొచ్చింది సమంత. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. దీనిని చూసిన అభిమానులు సమంత చాలా బాగా కవర్ చేసుకుంది, కేవలం అలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడే ఆమెకు లైట్ సెన్సిటివిటీ గుర్తొస్తుందా?, మిగిలిన సమయాల్లో ఆమెకి ఎందుకని కన్నీళ్లు రావు అని ప్రశ్నిస్తున్నారు. సమంత స్వతహాగానే సున్నిత మనస్కురాలని, అది ఆమె ఎంత కవర్ చేసుకున్నా దాగదని కామెంట్స్ చేస్తున్నారు.