https://oktelugu.com/

Sai Pallavi: బయటపడ్డ హీరోయిన్ సాయి పల్లవి భారీ మోసం..ఇన్నాళ్లు జనాలను ఇంత మాయ చేసిందా!

ప్రస్తుతం ఆమె చేతిలో 'తండేల్' అనే చిత్రం తో పాటు, బాలీవుడ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రామాయణం లో సీత గా నటిస్తుంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా, కేజీఎఫ్ యాష్ రావణాసురిడిగా, రకుల్ ప్రీత్ సింగ్ సూర్పనక్క గా నటిస్తున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : August 12, 2024 / 01:45 PM IST

    Sai Pallavi

    Follow us on

    Sai Pallavi: ఇండస్ట్రీ లో గత దశాబ్దకాలం లో వచ్చిన యంగ్ హీరోయిన్లు ప్రారంభం లో కాస్త మెరిసినప్పటికీ, రెండు మూడు ఫ్లాప్స్ పడడంతో కనుమరుగైన సంగతి అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం తమ యాక్టింగ్, డ్యాన్స్ టాలెంట్ తో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకొని ఎన్ని ఫ్లాప్స్ పడిన నిలదొక్కుకున్నారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు సాయి పల్లవి. అందరూ ఈమెని లేడీ పవర్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు. ఆ స్థాయి కల్ట్ ఫాలోయింగ్ ని ఈమె యూత్ లో సంపాదించుకుంది. కేవలం నటనకి మాత్రమే ప్రాధాన్యం ఉన్న పాత్రలను పోషిస్తూ వస్తున్న సాయి పల్లవి కి ఈమధ్య కాలం లో రెండు మూడు ఫ్లాప్ సినిమాలు రావడం తో స్క్రిప్ట్స్ విషయంలో కాస్త ఆచితూచి అడుగులు వేస్తోంది.

    ప్రస్తుతం ఆమె చేతిలో ‘తండేల్’ అనే చిత్రం తో పాటు, బాలీవుడ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రామాయణం లో సీత గా నటిస్తుంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా, కేజీఎఫ్ యాష్ రావణాసురిడిగా, రకుల్ ప్రీత్ సింగ్ సూర్పనక్క గా నటిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే సాయి పల్లవి కి ఇంత క్రేజ్ రావడానికి ప్రధాన కారణం ఆమె అద్భుతమైన డ్యాన్స్. ఈమె ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే పాపులర్ డ్యాన్స్ షో ‘ఢీ’ ద్వారానే తెలుగు ఆడియన్స్ కి పరిచయమైంది. డ్యాన్స్ తో పాటు అద్భుతమైన నటన, డైలాగ్ డెలివరీ ఆమె సొంతం. కానీ సాయి పల్లవి చెప్పే డైలాగ్స్ విషయం లో ఇంత పెద్ద మోసం దాగుందా అని రీసెంట్ గా సోషల్ మీడియా లో వైరల్ గా మారిన ఒక వీడియో ద్వారా తెలిసింది. ఆమె పాత్రలకు ఆమెనే డబ్బింగ్ చెప్తుంది అని ఇన్ని రోజులు మనం నమ్మి పప్పులో కాళ్ళు వేసాము. కానీ ఆమె పాత్రలకు డబ్బింగ్ ఆర్టిస్టు ద్వారానే చెప్పిస్తారు. అది కూడా అమ్మాయితో కాదు, అబ్బాయితో. క్రింద ఉన్న వీడియో చూస్తే మీ మతిపోకతప్పదు.

    ఫిదా, లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ చిత్రాలలో సాయి పల్లవి కి మంచి పేరు రావడానికి ప్రధాన కారణాలలో ఒకటి డైలాగ్స్. ఆ పాపులర్ డైలాగ్స్ ఉన్న సన్నివేశాలు అత్యధిక శాతం ఇతనితోనే చెప్పించారట. ఇన్ని రోజులు సాయి పల్లవి సొంతంగా డబ్బింగ్ చెప్తుంది అని నమ్మిన వాళ్లంతా ఇప్పుడు ఇంత మోసమా అంటూ సాయి పల్లవి ని ట్యాగ్ చేసి సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఇప్పుడు డబ్బింగ్ చెప్తున్న హీరోయిన్స్ అందరూ నిజంగానే డబ్బింగ్ చెప్తున్నారా, లేదా ఊరికే అలా ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారా అనే అనుమానాలు నెటిజెన్స్ లో కలిగాయి. సోషల్ మీడియా లో తన పైన వచ్చే ప్రతీ వైరల్ వార్తకు రెస్పాన్స్ ఇచ్చే సాయి పల్లవి దీనికి ఏమని రెస్పాన్స్ ఇస్తుందో అని ఆమె అభిమానులు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.