Mahesh Babu: మహేష్ బాబు కి చిరంజీవి చేసిన ఆ రెండు సినిమాలంటే చాలా ఇష్టమట…ఛాన్స్ వస్తే రీమేక్ చేస్తాడట..ఇంతకీ ఆ సినిమాలేంటి..?

స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న వాళ్ళు రీమేక్ సినిమాలను చేయడం కష్టమే అయిన కూడా కొంత మంది హీరోలు తరుచూ రీమేక్ లు చేస్తూ మంచి విజయాలను అందుకుంటారు... అయినప్పటికీ మరి కొందరు మాత్రం అసలు రీమేక్ సినిమాలే చేయరు...

Written By: Gopi, Updated On : August 12, 2024 1:39 pm

Mahesh Babu

Follow us on

Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా 40 సంవత్సరాల పాటు తన సినీ ప్రస్థానాన్ని కొనసాగించిన చిరంజీవి ప్రస్తుతం ఇప్పటికి కూడా తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు మెగాస్టార్ రేంజ్ ను టచ్ చేసే హీరో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఒకప్పుడు ఆయన మాస్ సినిమాలు చేస్తూ బి, సి సెంటర్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. చిరంజీవి డ్యాన్సులకు, ఫైట్లకు ఫిదా కానీ అభిమాని అంటూ ఉండడు…

వరుసగా ఆరు సంవత్సరాల పాటు 6 ఇండస్ట్రీ హిట్లను అందించిన ఏకైక హీరో కూడా చిరంజీవి గారే కావడం విశేషం…ఇక ఇప్పుడున్న స్టార్ హీరోలు కూడా ఒకప్పుడు చిరంజీవి అభిమానులే అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబుకి సైతం చిరంజీవి అంటే అమితమైన ఇష్టమని ఆయన పలు సందర్భాల్లో కూడా తెలియజేశాడు. వాళ్ళ నాన్న కృష్ణ గారి తర్వాత చిరంజీవి అంటేనే అతనికి చాలా అభిమానమని చిరంజీవి సినిమాలను తరచుగా చూస్తూ ఉండేవాడని చాలా సందర్భాల్లో తెలియజేయడం విశేషం…

ఇక ఇదిలా ఉంటే చిరంజీవి చేసిన రెండు సినిమాలంటే అతనికి చాలా ఇష్టమట. అందులో ఒకటి ‘ఘరానా మొగుడు’ కాగా, మరొకటి ‘రౌడీ అల్లుడు’ కావడం విశేషం… ఇక ఈ రెండు సినిమాలు చాలా ఎంటర్ టైనింగ్ గా ఉండటమే కాకుండా చిరంజీవిలోని క్లాస్ మాస్ యాంగిల్ ని టచ్ చేస్తూ ఉంటాయని మహేష్ బాబు ఒకానొక సందర్భంలో తెలియచేశాడు. ఇక మొత్తానికైతే తనకు ఒకవేళ చిరంజీవి సినిమాలను రీమేక్ చేసే అవకాశం వస్తే ఈ రెండు సినిమాల్ని రీమేక్ చేయడానికి తను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పడం విశేషం… బేసిగ్గా రీమేక్ సినిమాలకు దూరంగా ఉండే మహేష్ బాబు చిరంజీవి నటనకి ఆ సినిమాలో ఉన్న కథకి కనెక్ట్ అవడం వల్ల ఓన్లీ చిరంజీవి సినిమాల్లో ఈ రెండు సినిమాలను మాత్రం రీమేక్ చేస్తానని చెప్పడం విశేషం…

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో చేస్తున్న సినిమా మీద తీవ్రమైన కతరత్తులు చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయం మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక తొందర్లోనే రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన పూర్తి అప్డేట్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి ఈ సినిమాతో మహేష్ బాబు వరల్డ్ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోగా ఎదుగుతాడా లేదా అనేది…