OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘ఓజీ’ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాని దర్శకుడు తెరకెక్కిస్తున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈనెల 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాలో స్టార్ హీరోలు క్యామియో రోల్స్ పోషించబోతున్నారనే వార్తలైతే వస్తున్నాయి. మరి ఇలాంటి క్రమంలోనే నిజంగానే ఈ స్టార్ హీరోలు ఇందులో క్యామియో రోల్స్ పోషిస్తున్నారా?లేదా అనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమా దర్శకుడు అయిన సుజీత్ చెబుతున్న కథనం ప్రకారం ఈ సినిమాలో ఎలాంటి క్యామియో రోల్స్ లేవని ఏ స్టార్ హీరో కూడా ఇందులో నటించడం లేదనే క్లారిటీ అయితే ఇచ్చాడు.
Also Read: లిటిల్ హార్ట్స్’ మూవీ నాకు నచ్చలేదు : ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్
మొత్తానికైతే ఈ సినిమాలో హీరోగా చేస్తున్న పవన్ కళ్యాణ్ ఒక్కడు చాలని అతని సినిమాలో క్యామియో రోల్స్ చేసిన కూడా అవి పెద్దగా వర్కౌట్ కావనే ఉద్దేశంతోనే ఏ క్యామియో రోల్స్ పెట్టలేదని సినిమా మేకర్స్ నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి… పవన్ కళ్యాణ్ సైతం ఆయన చేస్తున్న ప్రతి సినిమాతో ఏదో ఒక మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకుంటూ ఉంటాడు.
ఇక మిగతా సినిమాలతో పోలిస్తే ఓజి సినిమా మీద చాలా మంచి అంచనాలు ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా అంచనాలకు మించి ఉండబోతుందంటూ డైరెక్టర్ సుజిత్ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు…ఇక ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమన్ ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెబుతున్నాడు.
అవకాశం దొరికిన ప్రతిసారి ఓజీ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డ్ లను బ్రేక్ చేస్తోంది అంటూ ఆయన చెబుతున్న మాటలు వింటుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఆనంద పడుతున్నారు…ఇక ఈ సినిమా రిలీజ్ కి మరో వారం రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ఎలాంటి విజయాన్నీ నమోదు చేస్తోంది అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…