Dil Ramesh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా ఇండియాలో ఉన్న చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక దిల్ రమేష్ లాంటి నటుడు సైతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి పాత్రలను పోషించాడు. చాలామంది స్టార్ హీరోలతో నటించిన ఘనత అతనికి దక్కుతోంది. మరి ఇలాంటి సందర్భంలోనే అతనికి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే చాలా ఆస్తులు ఉన్నాయంటూ ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయనకి హైదరాబాద్లో బతకడానికి ఇబ్బంది లేనంతగా ఆస్తులు ఉన్నాయని చెప్పాడు. తన కొడుకు టెక్సాస్ లో ఉన్నాడని తన కూతురు సిడ్నీలో ఉంటుందని చెప్పాడు. మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీ ద్వారా చాలామంది లైఫ్ ను సంపాదిస్తూ ఉంటారు. కొంతమంది చిన్న చిన్న ఆర్టిస్టులు సైతం భారీ ఎత్తున సంపాదిస్తూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక మరి కొంతమంది వ్యసనాలకు అలవాటు పడి స్టార్ నటులు సైతం ఉన్నదంతా కోల్పోతూ ఉంటారు.
లిటిల్ హార్ట్స్’ మూవీ నాకు నచ్చలేదు : ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్
సినిమా ఇండస్ట్రీలో కెరీర్ అనేది ఎంతకాలం ఉంటుంది అనేది ఎవరు చెప్పలేరు. కాబట్టి ఉన్నదాన్ని సక్రమంగా కాపాడుకుంటూ ముందుకు వెళితేనే ఫ్యామిలీ ఫ్యూచర్ బాగుంటుంది. లేకపోతే మాత్రం ఇక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతోంది.
ఇక ఆవిషయంలో దిల్ రమేష్ చాలా బాగా ప్లాన్ చేసుకున్నాడు. దిల్ రమేష్ కి హైదరాబాద్ సిటీ ఔట్ కట్స్ లో ఒక ఫామ్ హౌస్ కూడా ఉందని చెప్పాడు. మరి ఆ ఫామ్ హౌస్ ఎన్ని ఎకరాలు ఉంటుంది అనే దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. కానీ అందులో అన్ని రకాల పంటలను వేస్తానని చెప్పాడు.
ప్రస్తుతం ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది… ఇక తన ఫ్యామిలీ ఈ రేంజ్ లో ఉండడానికి తన వైఫ్ అని చెప్పాడు. అలాగే కుటుంబానికి సంబంధించిన విషయాలను తను పెద్దగా పట్టించుకోనని, సినిమాలకు సంబంధించిన విషయాలకు మాత్రమే తను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటానని చెప్పాడు…