Ashwin Kumar Mahavatar Narasimha: ప్రస్తుతం సినిమా ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. ఒకప్పుడు కమర్షియల్ సినిమాలనే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తూ వచ్చారు. అందువల్లే చిన్న హీరోలు పెద్ద హీరోలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కమర్షియల్ సినిమాలను చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు కమర్షియల్ సినిమాలకు కాలం చెల్లిపోయింది. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను మాత్రమే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా ఒక మంచి కాన్సెప్ట్ ను చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు అది యానిమేషన్ లో వస్తుందా? లేదంటే నార్మల్ సినిమాగా వస్తుందా అనే విషయాన్ని సైతం జనాలు మర్చిపోతున్నారు. దానికి ఉదాహరణగా రీసెంట్ గా వచ్చిన ‘మహావతార్ నరసింహ’ సినిమాని తీసుకోవచ్చు. ఈ సినిమా ఒక యానిమేటెడ్ సినిమాగా వచ్చింది. మొత్తానికైతే ఈ సినిమా 40 కోట్ల బడ్జెట్ తో తీసి 282 కోట్లకు పైన కలెక్షన్లను కొల్లగొట్టిందంటే మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమా దర్శకుడు అయిన అశ్విన్ కుమార్ రీసెంట్ గా ఈ సినిమా తీయడానికి తన పడిన ఇబ్బందుల గురించి వెల్లడించాడు…
Also Read: టీ బీజేపీలో కలహాలు.. రామచందర్రావు గుర్తించట్లేదా?
ఇక తను మాట్లాడుతూ నిజానికి నాకు దేవుడి మీద నమ్మకం అయితే లేదని, ఆయన ఉంటే ఒకరు సంతోషంగా, మరొకరు దుఃఖంతో ఎందుకుంటారు. ఈ దేవుడు అనే వారు ఎవరూ లేరని కావాలనే కొంతమంది వాళ్ళు ఉన్నట్టు సృష్టించారని అనుకునేవాడినని మరికొంతమందితో మూర్ఖంగా వాదించే వాడినని చెప్పాడు. కానీ భగవద్గీత చదివిన తర్వాత దేవుడు అనేవాడు ఏ రూపంలో అయినా వచ్చి మనుషులకు సాయం చేస్తాడు అనే ఒక భావాన్ని నమ్మానని, దానివల్ల భక్త ప్రహ్లాదుని కథ ను అనిమేటెడ్ గా తీయాలని నిశ్చయించుకున్నానని చెప్పాడు. అలాగే తనా భార్య అయిన శిల్పతో ఈ విషయాన్ని చెప్పాను.
మొత్తానికైతే 3డీ యానిమేషన్లో ఆ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం… ఇక పెళ్లి కి ముందు నా భార్య లండన్ లో జాబ్ చేసినపుడు పోగేసిన డబ్బులతో ఈ సినిమాను స్టార్ట్ చేశాం…కానీ కొద్దిరోజులు అయిన తర్వాత ఈ సినిమా అనుకున్నంత ఈజీగా అవ్వదని మాకు క్లారిటీ అయితే వచ్చింది. దానికోసం కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అర్థమైంది.
మా దగ్గర ఉన్న ఇల్లు, కారు, నగలు మొత్తం అన్ని అమ్మి ఈ సినిమా కోసం ఖర్చు పెట్టాం. అయినప్పటికి ఇంకా ఆ సినిమా పూర్తకపోవడంతో కొంతమంది ఇన్వెస్టర్ల నుంచి డబ్బులు తీసుకువచ్చి మరి ఈ సినిమాను పూర్తి చేశాం… మొత్తానికి అయితే ఈ మూవీని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అనే ఒక సందేహం ఐతే మదిలో ఉండేది…మొత్తానికి మేము పెట్టిన 40 కోట్ల బడ్జెట్ వచ్చిన సరిపోతోంది అని మా అప్పులన్నీ తీరుతాయి అని అనుకున్నాం.
కానీ అవుట్ పుట్ మాత్రం బాగా రావడంతో సినిమా మీద ఎక్కడో ఒకచోట మంచి ఒక కాన్ఫిడట్ అయితే వచ్చింది. మొత్తానికి అయితే 40 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా 282 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. ఇంకా సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది అంటూ అశ్విన్ కుమార్ తను పడిన కష్టం గురించి చెబుతూనే దానికి తగ్గ ప్రతిఫలం దక్కింది అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు…