Big Screen TV Sales: రోజంతా బిజీ వాతావరణంలో గడిపిన తరువాత శరీరం కాస్త రిలాక్స్ ను కోరుకుంటుంది. దీంతో చాలా మంది ఉత్సాహంగా గడపడానికి కొన్ని వ్యాపకాలు పెట్టుకుంటారు. కొంతమందికి తమ విధులు ముగిసిన తరువాత ఇంట్లో వాళ్లతో మాట్లాడాలని ఉంటుంది.. మరికొందరికి స్నేహితులతో గడపాలని ఉంటుంది. ఇవి సాధ్యం కాని సమయంలో ఏం చేయాలి? అనే టైంలో టెలివిజన్ పుట్టింది. పురాతన కాలం నుంచి టీవీ దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు స్మార్ట్ లోకి మారిపోయింది. థియేటర్లో ఉండేంత స్క్రీన్స్ తో టీవీలు అందుబాటులోకి వస్తున్నాయి. కాస్త ఖరీదు ఎక్కువైనా స్మార్ట్ టీవీలనే కొంటున్నారు. అయితే ఏ రకమైన టీవీ కొంటున్నారు? అనే చర్చ సాగుతున్న నేపథ్యంలో ఓ బ్రాండ్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడిందట. దాని గురించి తెలుసుకుందాం..
ప్రపంచంలో మిగతా దేశాలకంటే ఇండియన్స్ టీవీల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. ఓటీటీలు డెవలప్ అవుతున్న కొద్దీ చాలా మంది టీవీలను కొనుక్కొని ఇంట్లోనే సినిమాలను చూసేస్తున్నారు. అయితే సాధారణంగా స్మార్ట్ టీవీలు రకాలను భట్టి వేల నుంచి లక్షల రూపాయల ధర పలుకుతున్నాయి. ఇక బిగ్ స్క్రీన్ టీవీలైతే రూ.3 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు విక్రయిస్తున్నారు. అయితే ఎక్కువ మంది బిగ్ స్క్రీన్ టీవీలను కొనుగోలు చేయడానికే ఉత్సాహ పడుతున్నారని జీఎఫ్ కె మార్కెట్ రీసెర్చ్ ప్రకారం తేలింది. వీటిలో 65 అంగుళాల టీవీకి డిమాండ్ బాగా ఉందని వారు పేర్కొన్నారు.
వినోదం పొందడానికి ఎంత ఖర్చయినా వెచ్చించడానికి వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలో రూ.75 లక్షల టీవీకి విపరీతమైన డిమాండ్ ఉంది. LG కంపెనీకి చెందిన ఈ టీవీ దేశంలోని టాప్ టీవీలకంటే ఎక్కువగా అమ్ముడు పోతుంది. అయితే ఈ టీవీని మనకుఅసవరానికి అనుగుణంగా ఎలా అంటే అలా మలుచుకోవచ్చు. సౌండింగ్ తో పాటు హై క్వాలిటీ డిస్ ప్లేతో థియేటర్ ను తలపిస్తుంది. ఇక ఇదే కంపెనీకి చెందిన మరికొన్ని టీవీలు సైతం అత్యధికంగా విక్రయాలు జరుపుకుంటున్నాయి. రూ.20 లక్షలు, రూ.10 లక్షలు ధరలకు పైగా ఉన్న టీవీలు నెలకు 100కు పైగానే విక్రయిస్తున్నారట.
వీటి అమ్మకాలతో స్మార్ట్ టీవీ మార్కెట్ లో వృద్ధి పెరుగుతోంది. 2002లో బిగ్ స్క్రీన్ల అమ్మకాలు 9.88 బిలియన్ డాలర్లు కాగా.. 2023 చివరి నాటికి అది 11.7 బిలియన్ డాలర్లకు చేరింది. 2030 నాటికి వీటి విలువ 16.7 శాతం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. టెక్నాలజీ రంగానికి భారత ప్రభుత్వం ప్రోత్సాహం ఉండడంతో పాటు మేకిన్ ఇండియాలో భాగంగా కొత్త కొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీవీల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.