https://oktelugu.com/

Akhanda 2 : ‘పుష్ప 2’ దెబ్బకి అమాంతం పెరిగిపోయిన ‘అఖండ 2’ డిమాండ్..హిందీ రైట్స్ ఎంతకు అమ్ముడుపోయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

పాన్ ఇండియా లెవెల్ లో ప్రస్తుతం సీక్వెల్స్ కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. బాహుబలి సిరీస్, పుష్ప సిరీస్, కేజీఎఫ్ సిరీస్ అందుకు ఒక ఉదాహరణ.

Written By:
  • Vicky
  • , Updated On : December 11, 2024 / 04:17 PM IST

    Akhanda 2

    Follow us on

    Akhanda 2 : పాన్ ఇండియా లెవెల్ లో ప్రస్తుతం సీక్వెల్స్ కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. బాహుబలి సిరీస్, పుష్ప సిరీస్, కేజీఎఫ్ సిరీస్ అందుకు ఒక ఉదాహరణ. మన సౌత్ ఇండియా లో సీక్వెల్స్ కి మెంటలెక్కిపోయే రేంజ్ క్రేజ్ అయితే లేదు కానీ, బాలీవుడ్ ఆడియన్స్ మాత్రం ఒక రేంజ్ లో ఆదరిస్తున్నారు. ‘పుష్ప 2’ చిత్రం మాత్రమే కాదు, ఈ సినిమాకి ముందు విడుదలైన శ్రద్ధ కపూర్ ‘స్త్రీ 2’ చిత్రం కూడా బాలీవుడ్ లో సంచలనం సృష్టించి దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక ‘పుష్ప 2 ‘ చిత్రం వారం రోజుల్లోనే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టడం తో సీక్వెల్స్ ట్రెండ్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉందనే విషయం ట్రేడ్ పండితులకు అర్థమైంది. దీంతో త్వరలో విడుదల అవ్వబోయే సీక్వెల్స్ కి కూడా పాన్ ఇండియా లెవెల్ లో మంచి డిమాండ్ ఏర్పడింది.

    వాటిల్లో నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సీక్వెల్ కూడా ఉంది. బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాకి ముందు బాలయ్య కెరీర్ ముగిసిపోయే రేంజ్ లో ఉండేది. ఆయన సినిమాలకు కనీసం డబుల్ డిజిట్ క్లోజింగ్ షేర్స్ కూడా రాని రోజులవి. అలాంటి అతి క్లిష్టమైన స్థానం నుండి బాలయ్య ని వేరే లెవెల్ కి తీసుకెళ్లి పెట్టింది ఈ చిత్రం. ఈ సినిమాకి సీక్వెల్ ని ‘అఖండ’ థియేటర్స్ లో రన్నింగ్ లో ఉన్నప్పుడే ప్రకటించిన బోయపాటి శ్రీను, స్క్రిప్ట్ ని పాన్ ఇండియా లెవెల్ లో స్కోప్ ఉండేట్టు గా డెవలప్ చేసి, ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఘనంగా మొదలైన ఈ సినిమాని వచ్చే ఏడాది విజయదశమి కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

    అయితే ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ కి ఇప్పటి నుండి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది అట. ‘పుష్ప 2’ చిత్రాన్ని బాలీవుడ్ లో గ్రాండ్ గా విడుదల చేసిన ‘A2 ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ ఈ చిత్రం బాలీవుడ్ థియేట్రికల్ రైట్స్ ని 40 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈమధ్య కాలంలో బాలీవుడ్ ఆడియన్స్ దేవుడి నేపథ్యం ఉన్న కథలకు బ్రహ్మరథం పడుతుండడంతో బాలీవుడ్ మేకర్స్ ఇలాంటి జానర్ సినిమాలను భారీ రేట్స్ కి కొనుగోలు చేయడానికి ఏమాత్రం ఆలోచించట్లేదు. పైగా ‘అఖండ’ హిందీ వెర్షన్ టీవీ టెలికాస్ట్ కి అక్కడి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఈ సినిమా సీక్వెల్ గట్టిగా వర్కౌట్ అవుతుందనే ఉద్దేశ్యంతో A2 ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరికొన్ని వివరాలు త్వరలోనే తెలియనుంది.