Jani Master: జానీ మాస్టర్ కి ఊహించని షాక్ ఇచ్చిన కోర్టు..పోలీసులకు అనుమతిని ఇస్తూ ఉత్తర్వులు!

జానీ మాస్టర్ కి థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరగగా, అలాంటి చర్యలు ఏమి చేయరాదని, న్యాయవాది సమక్షం లోనే విచారించాలని పోలీసులను ఆదేశించింది కోర్టు. ఇది ఇలా ఉండగా జానీ మాస్టర్ తరుపున న్యాయవాది బెయిల్ పిటీషన్ ని కొద్దిరోజుల క్రింద దాఖా చేయగా సోమవారానికి కోర్టు వాయిదా వేసింది. మరి ఆయనకు ఈ కేసులో బెయిల్ వస్తుందా రాదా అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశగా మారింది.

Written By: Vicky, Updated On : September 25, 2024 3:22 pm

Jani Master(1)

Follow us on

Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే. శ్రేష్టి వర్మ అనే అమ్మాయిని గత 5 ఏళ్లుగా జానీ మాస్టర్ వేధిస్తున్నాడని, తనకు సినిమా ఆఫర్లు రానివ్వకుండా చేస్తున్నాడని ఆరోపిస్తూ జానీ మాస్టర్ పై FIR నమోదు చేయించింది. దీంతో గోవా లో పోలీసులకు పట్టుబడిన జానీ మాస్టర్ ని ఉప్పర్ పల్లి కోర్టులో హాజరు పర్చగా, కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ ని విధించింది. దీంతో పోలీసులు ఆయన్ని చంచలగూడా జైలుకు తరలించి రిమాండ్ సెల్ లో ఉంచారు. అయితే జానీ మాస్టర్ ని తదుపరి విచారణ కోసం నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీ కి తరలించాలని పోలీసులు పిటీషన్ వేయగా, రంగా రెడ్డి కోర్టు దానికి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే జానీ మాస్టర్ కి థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరగగా, అలాంటి చర్యలు ఏమి చేయరాదని, న్యాయవాది సమక్షం లోనే విచారించాలని పోలీసులను ఆదేశించింది కోర్టు. ఇది ఇలా ఉండగా జానీ మాస్టర్ తరుపున న్యాయవాది బెయిల్ పిటీషన్ ని కొద్దిరోజుల క్రింద దాఖా చేయగా సోమవారానికి కోర్టు వాయిదా వేసింది. మరి ఆయనకు ఈ కేసులో బెయిల్ వస్తుందా రాదా అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశగా మారింది. ఎందుకంటే జానీ మాస్టర్ ఇండియాలోనే టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్ లో ఒకడు. అనేక సినిమాలకు ఆయన అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. ఎట్టిపరిస్థితిలో వాటిని పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో జానీ మాస్టర్ ఇలా జైలు పాలు అవ్వడం వల్ల నిర్మాతలకు కోట్ల రూపాయిలు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున బెయిల్ కోసం దరఖాస్తు చేసారు. బెయిల్ మీద అనేక మంది స్టార్ హీరోలు సినిమాలు చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ వంటి బడా సూపర్ స్టార్స్ కూడా బెయిల్ మీదనే సినిమాలు చేస్తున్నారు. జానీ మాస్టర్ కూడా అలా బెయిల్ మీద వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అయితే ఆయన మీద పోస్కో చట్టం క్రింద కేసు నమోదు అయ్యింది. దీని మీద బెయిల్ రావడం కష్టం. కానీ నేరం రుజువు కాలేదు కాబట్టి రిమాండ్ సమయంలోనే జానీ మాస్టర్ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అక్టోబర్ 4 వ తేదీ వరకు రిమాండ్ కొనసాగుతుంది. ఆ పైన కూడా రిమాండ్ ని పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పీరియడ్ లోనే జానీ మాస్టర్ న్యాయవాది బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇది ఇలా ఉండగా జానీ మాస్టర్ భార్య సుమలత ఆయనకీ అన్ని విధాలుగా సపోర్టు చేస్తున్న సంగతి తెలిసిందే. తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని ఆమె బలంగా నమ్ముతుంది.