Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ రియాలిటీ మంచి టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ప్రారంభం కాస్త నత్తనడకన నడిచినప్పటికీ, మధ్యలో నుండి టాస్కులు ఆసక్తి కరంగా ఉండడం, కంటెస్టెంట్స్ మధ్య గొడవలు బాగా జరగడం వంటివి ఈ షో టీఆర్ప్ రేటింగ్స్ ని బాగా పెంచాయి. అన్ని సీజన్స్ లో లాగా కాకుండా ఈ సీజన్ లో సరికొత్త పద్దతులను ప్రవేశపెట్టారు. అవి ప్రేక్షకులకు బాగా నచ్చాయి. కెప్టెన్స్ కి బదులుగా చీఫ్స్ అనే కాన్సెప్ట్ ని పరిచయం చేసారు. అలాగే ప్రైజ్ మనీ కి బదులుగా పే మనీ ని పరిచయం చేసారు. అంటే కంటెస్టెంట్స్ కస్టపడి ఆడి ప్రతి వారం తమ పే మనీ ని పెంచుకోవాలి. ఇప్పటి వరకు మూడు వారాలకు గాను పే మనీ 11 లక్షల రూపాయలకు చేరింది.
ఇలా ప్రతీ అంశాన్ని డిఫరెంట్ గా ప్లాన్ చేసిన బిగ్ బాస్, వైల్డ్ కార్డు ఎంట్రీ ని కూడా చాలా స్పెషల్ గా డిజైన్ చేసాడు. ప్రతీ సీజన్ లో లాగానే ఒకరు, లేదా ఇద్దరు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఈ సీజన్ లో కూడా అడుగుపెడుతారని అందరూ అనుకున్నారు. అలా కాకుండా గత సీజన్ లో లాగా 6 మంది వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇస్తారని ఊహించారు ఆడియన్స్. కానీ ఎవ్వరి ఊహలకు అందని రేంజ్ లో బిగ్ బాస్ నేడు కంటెస్టెంట్స్ కి ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోయింది. ఈసారి 12 మంది వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టబోతున్నారని. కానీ వాళ్ళు రావాలంటే హౌస్ లో కొంతమంది కంటెస్టెంట్స్ బయటకి వెళ్లే ప్రమాదం కూడా ఉందని, కాబట్టి వాళ్ళను లోపలకు రానివ్వకుండా కొన్ని టాస్కులు పెడుతామని, ఆ టాస్కులలో గెలిచిన కంటెస్టెంట్స్ ఒక్కొక్క వైల్డ్ కార్డు కంటెస్టెంట్ ని లోపలకు రానివ్వకుండా అడ్డుకోవచ్చని బిగ్ బాస్ చెప్తాడు. దీనికి సంబంధించిన ప్రోమో ని కాసేపటి క్రితమే విడుదల చేసారు. బిగ్ బాస్ ఈ ట్విస్ట్ ఇచ్చిన వెంటనే కంటెస్టెంట్స్ కి మాత్రమే కాదు, ఆడియన్స్ కి కూడా ఫ్యూజులు ఎగిరిపోయాయి.
అయితే వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోయే కంటెస్టెంట్స్ గురించి ఇది వారికే మనకి ఒక క్లారిటీ వచ్చేసింది. కొత్త కంటెస్టెంట్స్ తో పాటుగా పాత కంటెస్టెంట్స్ కూడా హౌస్ లోకి రాబోతున్నారు. అలా పాత కంటెస్టెంట్స్ లో అవినాష్, హరి తేజ, రోహిణి, నయనీ పావని పేర్లు వినిపించాయి. అలాగే కొత్త కంటెస్టెంట్స్ జాబితా లో జ్యోతి రాయ్, అంజలి పవన్, రీతూ చౌదరి పేర్లు వినిపించాయి. వీరిలో ఎంత మంది హౌస్ లోకి ఎంటర్ అవ్వబోతున్నారు?, ఎంత మంది కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి రానివ్వకుండా ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ ప్రయత్నం చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారిన అంశం.